Mahesh Babu: మహేష్ బాబులో ఆ టాలెంట్.. రెండు గంటలు ఒకరితో మాట్లాడితే చాలు.. ఇక ఆ తర్వాత..
అమ్మ సెంటిమెంట్ తోపాటు.. మాస్ కమర్షియల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. అటు ఈ చిత్రంలోని పాటలకు యూట్యూబ్ లో సెన్సెషనల్ రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ మహేష్ బాబు నివాసంలో నిర్వహించారు. చిత్రయూనిట్ సభ్యులతోపాటు.. నిర్మాతలకు స్పెషల్ పార్టీ ఇచ్చాడు మహేష్. ప్రొడ్యూసర్ నాగవంశీ, నిర్మాత దిల్ రాజు, మీనాక్షి చౌదరీ, శ్రీలీల.. మహేష్ ఇచ్చిన సక్సెస్ పార్టీలో పాల్గొన్నారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటేస్ట్ సినిమా గుంటూరు కారం. సంక్రాంతి పండగ సందర్భంగా ఈనెల 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అటు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ మంచి వసూళ్లు రాబడుతుంది. అమ్మ సెంటిమెంట్ తోపాటు.. మాస్ కమర్షియల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. అటు ఈ చిత్రంలోని పాటలకు యూట్యూబ్ లో సెన్సెషనల్ రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ మహేష్ బాబు నివాసంలో నిర్వహించారు. చిత్రయూనిట్ సభ్యులతోపాటు.. నిర్మాతలకు స్పెషల్ పార్టీ ఇచ్చాడు మహేష్. ప్రొడ్యూసర్ నాగవంశీ, నిర్మాత దిల్ రాజు, మీనాక్షి చౌదరీ, శ్రీలీల.. మహేష్ ఇచ్చిన సక్సెస్ పార్టీలో పాల్గొన్నారు. అనంతరం హీరోయిన్ శ్రీలీలతో కలిసి యాంకర్ సుమకు ఇంటర్వ్యూ ఇచ్చారు మహేష్.
ఈ ఇంటర్వ్యూలో మహేష్ మాట్లాడుతూ.. గుంటూరు కారం సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ మూవీ మొత్తంలో మహేష్ కాల్చిన అన్ని బీడీలు ఆయుర్వేదంతో తయారు చేసినవి అని అసలు విషయం చెప్పేశాడు. ఇలాగే.. ఈ సినిమాలో తన క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుతూ.. స్లాంగ్ అండ్ క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ ప్రేక్షకులకు తెలియని విషయాన్ని బయటపెట్టాడు. మహేష్ అమ్మ, అమ్మమ్మ ఇద్దరూ గుంటూరు స్లాంగ్ లోనే మాట్లాడేవారని.. ఇంట్లో వాళ్లతో అలాగే మాట్లాడేవాడినని అన్నారు. అలాగే తనలో ఉన్న మరో టాలెంట్ గురించి చెప్పుకొచ్చాడు.
ఎవరితోనైనా మహేష్ రెండు గంటలు మాట్లాడితో..వారిని అచ్చు గుద్దినట్లు అలాగే దింపేస్తానని.. తనలో ఉన్న ఆ టాలెంట్ గురించి కేవలం త్రివిక్రమ్ కు మాత్రమే తెలుసని.. దానినే ఆయన ఉపయోగించుకున్నారని అన్నారు మహేష్. మహేష్ బాబుకు త్రివిక్రమ్ ఏదైనా సీన్ చెప్పాలంటే.. ఆ సమయంలో మీరు ఇలా మాట్లాడారు కదా.. అని చెప్పి అలా చేసేయండి అని చెబుతారంటా.. అతడు సినిమాకు ఇలా చేయలేదంట.. ఖలేజా మూవీకి మాత్రం ఇలా రిఫరెన్స్ చెప్పడంతోనే మహేష్ ఆ పాత్రను చాలా సులభంగా చేశారట. ఖలేజా సినిమాలోని పాత్రలాగే..ఇప్పుడు గుంటూరు కారం మూవీలోని రమణ పాత్రను త్రివిక్రమ్ అలాగే డిజైన్ చేశారని అన్నారు మహేష్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




