Mahesh Babu: మాటల్లో చెప్పలేనంతగా నిన్ను మిస్ అవుతున్నాను.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుండగా.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. ఈ క్రమంలో తాజాగా మహేష్ బాబు తన సోషల్ మీడియా ఖాతాలో చేసిన పోస్ట్ ఇప్పుడు తెగ వైరలవుతుంది.

Mahesh Babu: మాటల్లో చెప్పలేనంతగా నిన్ను మిస్ అవుతున్నాను.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్..
Mahesh Babu

Updated on: Apr 20, 2025 | 2:50 PM

దివంగత స్టార్ కృష్ణ నటన వారసుడిగా సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. యువరాజు, రాజకుమారుడు, మురారి వంటి చిత్రాలతో మెప్పించాడు. ఆ తర్వాత ఒక్కరు, పోకిరి వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో మాస్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. చివరిసారిగా గుంటూరు కారం సినిమాతో విజయాన్ని అందుకున్న మహేష్.. ప్రస్తుతం పాన్ వరల్డ్ మూవీలో నటిస్తున్నారు. ట్రిపుర్ ఆర్ సినిమాతో సంచనలం సృష్టించిన డైరెక్టర్ రాజమౌళి.. ఇప్పుడు మహేష్ బాబు ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుంది. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకోగా.. ప్రస్తుతం మహేష్ తన ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వేకేషన్ లో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో మహేష్ షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు తెగ వైరలవుతుంది.

ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి పుట్టినరోజు. ఈ సందర్భంగా తన తల్లిని గుర్తుచేసుకుంటూ అమ్మతో కలిసి దిగిన ఫోటోనూ నెట్టింట షేర్ చేశారు మహేష్. “హ్యాప్పీ బర్త్ డే అమ్మా.. మాటల్లో చెప్పలేనంతగా నిన్ను మిస్ అవుతున్నాను” అంటూ తన తల్లిని గుర్తుచేసుకున్నారు. మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి రెండేళ్ల క్రితం సెప్టెంబర్ 2022లో కన్నుమూశారు. మహేష్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ కావడంతో ఫ్యా్న్స్ సైతం ఇందిరా దేవికి బర్త్ డే విషెస్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ అచ్చం హాలీవుడ్ రేంజ్ హీరోగా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండడం.. అడ్వెంచర్ డ్రామాగా ఉండనుందని తెలియడంతో ఈసినిమా అంచనాలు మరింత పెరిగాయి.

ఇవి కూడా చదవండి :  

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..

OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..