సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త ఇప్పటికీ అభిమానులు, కుటుంబసభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. సూపర్ స్టార్ గా తెలుగు సినిమాకు కృష్ణ చేసిన సేవ చరిత్రలో నిలిచిపోతుంది. దాదాపు 350కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు కృష్ణ. ఈ నెల 15న సూపర్ స్టార్ కృష్ణ తుదిశ్వాస విడిచారు. నటశేఖరుడి మరణంతో మహేష్ కుటుంబంతోపాటు తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఈ నెల14న అర్ధరాత్రి సమయంలో కృష్ణకు గుండెపోటు రావడంతో ఆయనను కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందిన కృష్ణ ఈ నెల 15న తెల్లవారుజామున 4.09 గంటలకు తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో తెలుగు సినీ పరిశ్రమలో ఓ శకం ముగిసింది. కృష్ణ చిన్న కుమారుడు మహేష్ తండ్రికి తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. ఈ ఏడాది మహేష్ కు కోలుకొని ఎదురు దెబ్బలు తగిలాయి. మహేష్ అన్న రమేష్ బాబు, తల్లి ఇందిరా దేవి, ఇప్పుడు తండ్రి కృష్ణ ఇలా ఒకరి తర్వాత ఒకరు మహేష్ కు దూరమయ్యారు.
ఇక తండ్రి చనిపోయిన సమయంలో మహేష్ ను కన్నీరు మున్నీరయ్యారు. ఇదిలా ఉంటే కృష్ణ చనిపోయిన తర్వాత మొదటిసారి మహేష్ బాబు స్పందించారు. తండ్రిని తలుచుకుంటూ మహేష్ ఒక ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశాడు. “నీ జీవితం వేడుకగా గడచిపోయింది. నీ నిష్క్రమణం కూడా అంతే వేడుకగా సాగింది. అదే మీ గొప్పతనం. మీరు మీ జీవితాన్ని నిర్భయంగా గడిపారు. ధైర్యం, సాహసం మీ స్వభావం.. మీ వెలుగు నాలో ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటుంది. విచిత్రమేమిటంటే, నేను ఇంతకు ముందెన్నడూ లేని శక్తిని నాలో అనుభవిస్తున్నాను.. ఇప్పుడు నేను నిర్భయంగా ఉన్నాను.. అచ్చం మీలాగే.. నీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాను.. నిన్ను మరింత గర్వపడేలా చేస్తాను… లవ్ యూ నాన్నా… మై సూపర్ స్టార్ అంటూ ట్వీట్ చేశారు మహేష్.
— Mahesh Babu (@urstrulyMahesh) November 24, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..