Mahesh Babu : మహేష్ బాబుకు టెన్షన్‏గా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే.. అసలు విషయం చెప్పిన హీరో..

మహేష్ బాబు.. ప్రస్తుతం వారణాసి సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా.. మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

Mahesh Babu : మహేష్ బాబుకు టెన్షన్‏గా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే.. అసలు విషయం చెప్పిన హీరో..
Mahesh Babu

Updated on: Dec 28, 2025 | 2:07 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు వారణాసి సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. గుంటూరు కారం సక్సెస్ తర్వాత మహేష్ నటిస్తున్న సినిమా ఇది. అలాగే ఈ చిత్రానికి డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తుండగా.. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో మహేష్ హాలీవుడ్ హీరో లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ మరిన్ని అంచనాలు పెంచేసింది. అయితే తన ప్రతి సినిమా విడుదలకు ముందు మహేష్ ఎంతో టెన్షన్ పడుతుంటారు.

ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్‏లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..

ప్రతి సినిమాను తన మొదటి సినిమాలాగే భావిస్తారట. అలాగే సినిమా విడుదల సమయంలోనూ ఎంతో టెన్షన్ పడుతుంటారు. ఒకప్పుడు మహేష్ తన సినిమా విడుదలకు ముందు తన తల్లి ఇందిరా దేవి వద్దకు వెళ్లేవారట. ఆమె చేతితో చేసే కాఫీ తాగి రిలాక్స్ అయ్యేవారట. అమ్మ చేతి కాఫీ తాగితే టెన్షన్ తగ్గేదని.. ఆ సమయంలో తాను ఎంతో ప్రశాంతంగా ఉంటుందట. ఈ విషయాన్ని మహేష్ బాబు గతంలో అన్ స్టాపబుల్ షోలో వెల్లడించారు.

ఇవి కూడా చదవండి :  The Paradise: కాంబో అదిరింది భయ్యా.. నానితో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ది ప్యారడైజ్ నుంచి క్రేజీ అప్డేట్..

అమ్మ చేతి కాఫీ తాగితే తన టెన్షన్ మొత్తం తగ్గుతుందని బాలయ్యతో పంచుకున్నారు మహేష్. ప్రస్తుతం మహేష్ చేతిలో వారణాసి సినిమా మాత్రమే ఉంది. గ్లోబల్ రేంజ్ లో రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టు కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027లో విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి : Vinay Rai: అప్పుడు హీరోగా.. ఇప్పుడు విలన్‏గా.. ఈ నటుడి ప్రియురాలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఎవరంటే.