Mahesh Babu : ఈరోజు నీ గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నా.. మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్..

భారతీయ సినీ పరిశ్రమలో మరికాసేపట్లో పండగ వాతావరం నెలకొననుంది. ఎన్నో సంవత్సరాలుగా ఘట్టమనేని అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి ప్రాజెక్ట్ పై ఈరోజు సాయంత్రం అధికారిక ప్రకటన రానుంది. ఇప్పటికే ఈ వేడుక హడావిడి మొదలైంది. ఈ క్రమంలో తాజాగా మహేష్ బాబు తన సోషల్ మీడియా ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు.

Mahesh Babu : ఈరోజు నీ గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నా.. మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్..
Mahesh Babu

Updated on: Nov 15, 2025 | 2:48 PM

భారతీయ సినీప్రియులు, ఘట్టమనేని అభిమానులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. మరికాసేపట్లో యావత్ భారతీయ ఇండస్ట్రీ వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ గురించి పూర్తి విషయాలు తెలియనున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రాబోతున్న SSMB 29 (ప్రచారంలో ఉన్న టైటిల్)కు సంబంధించి టైటిల్ లాంచ్, హీరో లుక్ రివీల్ చేయనున్నారు. నవంబర్ 15న అంటే.. శనివారం సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో గ్లోబ్ ట్రోటర్ అనే పేరుతో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ నుంచి సినీప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి సందర్భంగా తండ్రిని గుర్తుచేసుకుంటూ మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..

ఇవి కూడా చదవండి

“నాన్నా.. ఈరోజు నీ గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నాను. మీరుంటే చాలా గర్వపడేవారు” అంటూ తన చిన్ననాటి ఫోటోను పంచుకున్నారు. దీంతో ఈరోజు ఈవెంట్ లో మహేష్ స్పీచ్ పై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో రూపొందిస్తున్నారు జక్కన్న. ఇప్పటికే పలు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్నా ఈ సినిమాకు సంబంధించిన తొలి ఈవెంట్ ఇదే. దీంతో ఇప్పుడు ఈ వేడుకపై మరింత ఆసక్తి నెలకొంది. అసలు ఈ ఈవెంట్లో ఎలాంటి విషయాలు రివీల్ చేయనున్నారనే విషయంపై మరింత క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు.

Bigg Boss 9 Telugu: సీన్ మారింది.. బిగ్‏బాస్ దుకాణం సర్దేయాల్సిందే.. ఓర్నీ మరి ఇంత అట్టర్‌ఫ్లాపా..

ఈ చిత్రంలో మహేష్ బాబుతోపాటు ప్రియాంక చోప్రా, మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. గతంలో మహేష్ ప్రీ లుక్ రివీల్ చేయగా.. ఇటీవల పృథ్వీరాజ్, ప్రియాంక ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. వీరి పోస్టర్స్ తో సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. ఇక ఈ రోజు మహేష్ లుక్, టైటిల్ వివరాలు పంచుకోనున్నారు.

Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..