మహేష్ ,రాజమౌళి సినిమా షూటింగ్ నుంచి వీడియో లీక్ .. చర్యలు తీసుకుంటున్న జక్కన్న టీమ్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల విజయం తర్వాత జక్కన మరోసారి భారీ బడ్జెట్ సినిమాను రూపొందించేందుకు సిద్ధమయ్యాడు.

మహేష్ ,రాజమౌళి సినిమా షూటింగ్ నుంచి వీడియో లీక్ .. చర్యలు తీసుకుంటున్న జక్కన్న టీమ్
Mahesh Babu

Updated on: Mar 09, 2025 | 7:36 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి సినిమా ఇటీవలే పట్టాలెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాలీవుడ్ లవర్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈసారి మహేష్ బాబుతో ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టాలని చూస్తున్నారు జక్కన్న. ఇప్పటికే ఈ సినిమా పాన్ గ్లోబల్ గా ఉంటుందని అంటున్నారు. అంతే కాదు ఈ సినిమా పై ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఆఫ్రికర్ ఫారెస్ట్ నేపథ్యంలో ఈ సినిమా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మరో వైపు ఈ సినిమాలో రాజమౌళి రామాయణం టచ్ కూడా ఇవ్వనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఎలాంటి లీక్స్ రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు రాజమౌళి.

కానీ మహేష్ బాబు ల లుక్ మాత్రం రివీల్ అయ్యింది. ఇప్పటికే మహేష్ బాబు ఎయిర్ పోర్ట్ లో కనిపించిన ఫోటోలు  సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రెగ్యులర్‌ షూటింగ్‌ కొన్ని రోజుల క్రితం ఒడిశాలో మొదలైంది. ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు షూటింగ్ నుంచి వీడియో లీక్ అయ్యింది. షూటింగ్ సమయంలో సన్నివేశాన్ని ఒకరు ఫోన్ లో షూట్ చేశారు. అదికాస్తా బయటకు రావడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. షూటింగ్ స్పాట్ నుంచి వీడియో లీక్ అవ్వడంతో జక్కన్న టీమ్ చర్యలకు రెడీ అయ్యింది.

మహేష్ సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్న అభిమానులు ఇప్పుడు ఈ వీడియో లీక్ అవ్వడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ప్రస్తు తం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది. దాంతో రాజమౌళి టీమ్ ఈ వీడియోను తొలగించే పనిలో పండింది . అలాగే ఇక పై ఇలాంటివి జాగరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోనుందని తెలుస్తుంది. ఇక మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.  త్వరలోనే ప్రియాంక షూటింగ్ లో జాయిన్ అవ్వనుందని తెలుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.