Mahesh Babu: వారెవ్వా.. కూతురు సితారతో మహేష్ బాబు కొత్త యాడ్.. వీడియో అదిరిపోయిందిగా..

|

Mar 22, 2025 | 6:03 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా తన కూతురు సితారతో కలిసి ఓ యాడ్ చేశారు. ఫ్యాషన్ దుస్తులకు సంబంధించిన ఈ ప్రకటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అందులో మహేష్, సితార లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఇందుకు సంబంధించిన ఫోటోస్ సైతం చక్కర్లు కొడుతున్నాయి.

Mahesh Babu: వారెవ్వా.. కూతురు సితారతో మహేష్ బాబు కొత్త యాడ్.. వీడియో అదిరిపోయిందిగా..
Mahesh Babu, Sitara
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి ప్రాజెక్ట్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. భారీ ఎత్తున హాలీవుడ్ రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ఆఫ్రీకన్ అడవుల నేపథ్యంలో అడ్వైంచర్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో మహేష్ సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ ఒడిశా షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను మేకర్స్ నెట్టింట షేర్ చేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్ సైతం కీలకపాత్రలు పోషించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా మహేష్ బాబు తన కూతురు సితారతో చేసిన ఓ యాడ్ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

మహేష్ బాబు గారాలపట్టి సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం ఇన్ స్టాలో డ్యాన్స్ వీడియోస్.. ఫోటోస్, షేర్ చేస్తుంటుంది. సితార సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లు ఇదివరకే వెల్లడించింది. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే పలు యాడ్స్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే ఓ జ్యువెల్లరీ సంస్థకు ప్రచారకర్తగా ఉన్న సితార.. తాజాగా తన తండ్రితో కలిసి మరో యాడ్ చేసింది. మహేష్ బాబు, సితార కలిసి ట్రెండ్ కంపెనీకి సంబంధించిన యాడ్ చేశారు. అందులో మహేష్, సితార స్టైలీష్ లుక్స్ అభిమానులను కట్టిపడేస్తున్నాయి. అలాగే ఇందులో వీరిద్దరి అనుబంధాన్ని చూసి అడియన్స్ ఫిదా అవుతున్నాయి.

ఈ యాడ్ వీడియోలో మహేష్ బాబు కొద్దిపాటి గడ్డంతోపాటు క్లాసిక్ లుక్ లో కనిపించగా.. సితార తన చిరునవ్వుతో మరింత క్యూట్ గా కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత తండ్రికూతురిని ఒకే వీడియోలో చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. యాడ్ ఐడియ అదిరిపోయిందని.. సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..