Guntur Kaaram : మహేషా మజాకా.. గుంటూరు కారం దెబ్బకు హాలీవుడ్‌లో రీ సౌండ్

సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

Guntur Kaaram : మహేషా మజాకా.. గుంటూరు కారం దెబ్బకు హాలీవుడ్‌లో రీ సౌండ్
Mahesh Babu

Updated on: Jun 04, 2023 | 1:46 PM

మహేష్ గుంటూరు కారం హాలీవుడ్‌ను తాకింది. అక్కడ కూడా నషాలానికంటే హీట్‌ను పుట్టించింది. ఏకంగా హాలీవుడ్ మ్యాగజీన్ వెరైటీలో ప్రముఖంగా వచ్చేసింది. వరల్డ్ వైడ్ ఒక్కసారిగా అందరూ తన వైపే చూసేలా చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి  . ఇక ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మరో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది. ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్.

ఎస్.ఎస్.ఎమ్‌ బీ 28 వర్కింగ్ టైటిల్తో.. నిన్న మొన్నటి వరకు విపరీతంగా బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. టైటిల్‌ అనౌన్స్ మెంట్‌తో అంతకు మించిన రేంజ్లో రీసౌండ్ చేస్తోంది. హైలీ ఇన్‌ఫ్లేమబుల్‌గా.. మహేష్ మాస్‌ అవతార్‌కు అద్దం పడుతోంది. జెస్ట్ చిన్న టీజ్‌ తోనే.. రికార్డులు కూడా క్రియేట్ చేసింది.

రికార్డులు క్రియేట్ చేయడమే కాదు.. ఏకంగా హాలీవుడ్ పాపులర్ మ్యాగజీన్లో కూడా మహేష్ మాస్ స్ట్రైక్ ఓ ఆర్టికల్ గా మారింది. సినిమా డీటెల్స్ తో పాటు.. టైటిల్ టీజర్ లింక్‌ కూడా పబ్లిష్ అయింది. ఇక ఇప్పుడిదే త్రూ అవుట్ ఇండియా తెగ వైరల్ అవుతోంది. మహేష్ ఫ్యాన్స్‌ను కాలర్ ఎగరేసేలా చేస్తోంది.