Mahesh Babu: పాన్ ఇండియా చిత్రానికి రెడీ అవుతున్న మహేష్.. క్లారిటీ ఇచ్చిన ప్రిన్స్.. డైరెక్టర్ ఎవరో తెలుసా..

|

Oct 15, 2021 | 9:16 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకింగ్

Mahesh Babu: పాన్ ఇండియా చిత్రానికి రెడీ అవుతున్న మహేష్.. క్లారిటీ ఇచ్చిన ప్రిన్స్.. డైరెక్టర్ ఎవరో తెలుసా..
Mahesh Babu
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న మోసాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా… ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమా తర్వాత.. మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. అలాగే.. త్రివిక్రమ్ కాకుండా.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలోనూ ఓ మూవీ చేయనున్నాడు మహేష్. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత.. వీరిద్దరి కాంబోలోని ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లుగా వార్తలు వచ్చినా… ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

తాజాగా.. రాజమౌళితో సినిమా చేయడం గురించి మహేష్ స్పందించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్.. తన తదుపరి ప్రాజెక్స్ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. రాజమౌళితో పాన్ ఇండియా అరంగేట్రానికి సిద్దంగా ఉన్నాను.్. హీందిలో అరంగేట్రం చేయడానికి ఇదే సరైన సినిమా.. అన్నారు మహేష్.. ఈ చిత్రం బహు భాషల్లో రూపొందుతుంది… ఇక ఈ సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కెఎల్ నారాయణ నిర్మిస్తారు. ఇక రాజమౌళి, మహేష్ సినిమా కోసం విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. ఇక మహేష్.. త్రివిక్రమ్ సినిమాలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్‌గా కనిపించనున్నాడు. ఇక హీరోయిన్ పూజ హెగ్డే అలరించనుంది. నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని తెలుస్తుంది.

Also Read : Raja Raja Chora: ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ సినిమా..

Naveen Chandra: ‘తగ్గేదే లే’ అంటున్న నవీన్ చంద్ర.. ఆసక్తికరంగా టీజర్ విడుదల

Hansika Motwani: హన్సిక ప్రధాన పాత్రలో మై నేమ్ ఈజ్ శృతి.. ఊహించని మలుపులతో ఉండబోతున్న మూవీ..