AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ బాబు డిగ్రీ ఐడెంటిటీ కార్డు వైరల్.. అప్పట్లో బాబు గ్లామర్ చూస్తే మెంటలెక్కిపోద్ది

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ది గ్రేట్ రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమా చేస్తున్నాడు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇందులో కథానాయిక పాత్రలో కనిపించనుంది. అలాగే మలయాళం సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే విలన్ పాత్రలో యాక్ట్ చేస్తున్నారు.

Mahesh Babu: మహేష్ బాబు డిగ్రీ ఐడెంటిటీ కార్డు వైరల్.. అప్పట్లో బాబు గ్లామర్ చూస్తే మెంటలెక్కిపోద్ది
Mahesh Babu
Basha Shek
|

Updated on: May 27, 2026 | 3:14 PM

Share

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ది మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో మహేష్ కూడా ఒకడు. వయసు పెరుగుతున్నా కొద్దీ అతను మరింత గ్లామరస్‌గా తయారవుతున్నాడు. ‘ఎవర్ గ్రీన్ హ్యాండ్సమ్’ అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్. వారణాసి పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ మూవీ ప్రేక్షలకు ముందుకు రానుంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు కాలేజ్ డేస్ కు సంబంధించిన ఒక అరుదైన ఐడెంటిటీ కార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మహేష్ బాబు చెన్నైలోని ప్రముఖ ‘లోయోలా కాలేజ్’ లో బి.కామ్ చదువుకున్నారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బయటకు వచ్చిన ఈ మహేష్ ఐడీ కార్డు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఐడీ కార్డులో ఉన్న సమాచారం ప్రకారం మహేష్ బాబు పూర్తి పేరు ఘట్టమనేని మహేష్ బాబు. ఐడీ నెంబర్ LCC/1997/4321 కాగా, రోల్ నెంబర్ 97-1186 గా ఉంది. మహేష్ బాబు 1997 నుంచి 2000 సంవత్సరం బ్యాచ్‌లో చెన్నై లోయోలా కాలేజీలో బి.కామ్ కోర్సు చదివినట్లు ఇందులో ఉంది. ఈ కార్డును 15 జూలై 1997న జారీ చేయగా, ఇది మే 2000 వరకు వ్యాలిడిటీ ఉన్నట్లు చూపిస్తోంది. ఇక మహేష్ పుట్టిన తేదీ 09-08-1975గా, బ్లడ్ గ్రూప్ O +ve గా ఇందులో పేర్కొన్నారు. ఇక అడ్రెస్ స్థానంలో హైదరాబాద్‌లోని ‘పద్మాలయా స్టూడియోస్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్ – 500034’ అని రాసి ఉంది. ఈ కార్డుపై ప్రిన్సిపాల్ డాక్టర్ ఎఫ్. ఆండ్రూ సంతకంతో పాటు మహేష్ బాబు చేసిన సంతకం కూడా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరలవుతోన్న మహేష్ డిగ్రీ ఐడీ కార్డ్..

అయితే ఈ ఐడెంటిటీ కార్డ్ పై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఇది ఒరిజినల్ కాదు.. ఫేక్! ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు కొంత మంది అప్పట్లో మహేష్ బాబు ఎంతో హ్యాండ్సమ్‌గా ఉన్నారంటూ మురిసిపోతున్నారు. అయితే ఇది ఫేక్ ఐడీ కార్డు అని క్లియర్ గా తెలుస్తోంది. ఎందుకంటే సేమ్ టు సేమ్ ఇది డిజైన్ తో పలువురు స్టార్ హీరోల ఐడీ కార్డులు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Globe Trotter (@bob__jr____)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహేష్ డిగ్రీ ఐడెంటిటీ కార్డు .. అప్పట్లో బాబు ఎలా ఉన్నాడో చూశారా?
మహేష్ డిగ్రీ ఐడెంటిటీ కార్డు .. అప్పట్లో బాబు ఎలా ఉన్నాడో చూశారా?
చాణక్యుడు చెప్పిన హెచ్చరిక: ఈ ఐదు పనులను వాయిదా వేస్తే భారీ నష్టం
చాణక్యుడు చెప్పిన హెచ్చరిక: ఈ ఐదు పనులను వాయిదా వేస్తే భారీ నష్టం
రామాయణాన్ని తలపించిన వింత.. ఆ అడవుల్లో అరుదైన తెల్ల జింక దర్శనం..
రామాయణాన్ని తలపించిన వింత.. ఆ అడవుల్లో అరుదైన తెల్ల జింక దర్శనం..
బుడ్డోడి కోసం ఏకంగా 3 బ్రహ్మాస్త్రాలు సిద్ధం చేశాం: SRH కెప్టెన్
బుడ్డోడి కోసం ఏకంగా 3 బ్రహ్మాస్త్రాలు సిద్ధం చేశాం: SRH కెప్టెన్
తెలంగాణలో సమ్మర్ హైడ్రేషన్ యాత్ర.. 7 నగరాల్లో eRZL అవగాహన ప్రచారం
తెలంగాణలో సమ్మర్ హైడ్రేషన్ యాత్ర.. 7 నగరాల్లో eRZL అవగాహన ప్రచారం
మీ ఇంట్లో ఈ ఫోటోలు ఉన్నాయా? అయితే అదృష్టం మారిపోతుందట!
మీ ఇంట్లో ఈ ఫోటోలు ఉన్నాయా? అయితే అదృష్టం మారిపోతుందట!
నైరుతి రుతుపవనాలపై అప్డేట్.. వాతావరణశాఖ కీలక ప్రకటన..
నైరుతి రుతుపవనాలపై అప్డేట్.. వాతావరణశాఖ కీలక ప్రకటన..
ఇకపై ఏడాదికి 2సార్లు ఐపీఎల్.. బీసీసీఐ సంచలన నిర్ణయం?
ఇకపై ఏడాదికి 2సార్లు ఐపీఎల్.. బీసీసీఐ సంచలన నిర్ణయం?
దీన్ని డైరెక్ట్‌గా చూసినవాళ్లను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు..
దీన్ని డైరెక్ట్‌గా చూసినవాళ్లను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు..
నిరుద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. త్వరలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. త్వరలో ఉద్యోగాలకు నోటిఫికేషన్