
సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఎంతో మంది చిన్నారులకు ప్రాణాలను భరోసా అందించారు. వందల మంది పసి పిల్లలకు గుండె ఆపరేషన్స్ చేయిస్తూ తల్లిదండ్రుల కళ్లల్లో సంతోషాన్ని నింపుతున్నారు. మహేష్ ఫౌండేషన్‌లో ఎంతో మందికి సాయం అందిస్తున్నారు. ఇక మహేష్ బాటలోనే ఆయన కుమారుడు గౌతమ్, కుమార్తె సితార సైతం సేవా కార్యక్రమాల్లో తమ వంతు సాయం చేస్తున్నారు. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా పాఠశాల విద్యార్థినీలకు సైకిల్స్ బహుమతిగా అందించింది సీతూపాప. అలాగే కొద్దిరోజుల క్రితం ఓ జ్యువెల్లరీ సంస్థకు కమర్షియల్ యాడ్ చేసింది. ఇందుకు వచ్చిన పారితోషికాన్ని మహేష్ ఫౌండేషన్‌కు విరాళం ఇచ్చేసి తన మంచి మనసు చాటుకుంది. ఇక తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకుంది సీతాపాప.
శనివారం హైదరాబాద్ లోని మ్యాక్స్ బ్రాండ్ షోరూం ఓపెనింగ్ కార్యక్రమంలో నమ్రత శిరోద్కర్ తోపాటు సితార వెళ్లింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అక్కడే కొంతమంది పేదవారికి, వృద్ధులకు మ్యాక్స్ బ్రాండ్ బట్టలు అందచేసింది. అయితే అదే సమయంలో ఓ పెద్దావిడ స్టేజీ మీదకు రావడానికి కష్టపడుతుండగా.. సితార కిందకు దిగి పెద్దావిడ చేయి పట్టుకుని పైకి తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. సితారపై పొగడ్తలు కురిపిస్తున్నారు. ఘట్టమనేని బ్లడ్.. అలాగే ఉంటుంది. సాయం చేయడానికి ఎప్పుడూ ముందుటారు.. తండ్రి బాటలోనే కూతురు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
LIKE FATHER 💖, LIKE DAUGHTER 💖#MaheshBabu #Sitaraghattamaneni https://t.co/SOdo0FGJGh
— Rama Krishna (@RamaKrishna4751) October 1, 2023
ఇక అదే కార్యక్రమంలో గిఫ్టులు అందించినందుకు ఓ పెద్దావిడ సితారను ముద్దు పెట్టుకుని ఆశీర్వాదించింది. అక్కడున్న పెద్దవాళ్లందరితో సితార నవ్వుతూ.. షేక్ హ్యాండ్స్ ఇస్తూ ఎంతో చక్కగా మాట్లాడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇదిలా ఉంటే.. తనకు నటనపై ఆసక్తి ఉందని.. భవిష్యత్తులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు నమ్రత, మహేష్ గతంలోనే అనౌన్స్ చేశారు. అటు మరోవైపు సోషల్ మీడియాలో సితార ఫుల్ యాక్టివ్. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్న సితార వీడియో నిత్యం నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి.
Ghattamaneni Blood ❤️🔥 @urstrulyMahesh #Sitaraghattamaneni pic.twitter.com/dFvUypU6ps
— SWAG_SSMB FC™ (@SWAG_SSMB) September 30, 2023
Amma be like naa bangaru thalli ♥️👌#sitaraghattamaneni snapped in Hyderabad
sitaraghattamaneni#MaheshBabu#namratashirodkar @urstrulyMahesh pic.twitter.com/a52ToI8t6h— ARTISTRYBUZZ (@ArtistryBuzz) September 30, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.