SSMB 29 : మహేష్ బాబుతో సినిమా.. 16 ఏళ్ల క్రితమే మాటిచ్చిన జక్కన్న.. ఇంతకీ ఈ సినిమా నిర్మాత ఎవరో తెలుసా..

ప్రస్తుతం భారతీయ సినీప్రియులు అందరి చూపు గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ పైనే ఉంది. రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రాబోతున్న SSMB 29 సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు రివీల్ చేయనున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది. ఈ క్రమంలోనే ఈసినిమా ప్రొడ్యుసర్ ఎవరనే విషయాన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు నెటిజన్స్.

SSMB 29 : మహేష్ బాబుతో సినిమా.. 16 ఏళ్ల క్రితమే మాటిచ్చిన జక్కన్న.. ఇంతకీ ఈ సినిమా నిర్మాత ఎవరో తెలుసా..
Ssmb 29

Updated on: Nov 15, 2025 | 3:08 PM

భారతీయ సినీప్రియులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా SSMB 29. ఇది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ప్రాజెక్ట్ ఇది. మొదటి నుంచి ఈ మూవీపై ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మహేష్ బాబు ప్రీ లుక్ రిలీజ్ చేశారు. అలాగే ఇటీవల గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేయడంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వేడుకను గ్లోబ్ ట్రోటర్ పేరుతో ఈరోజు రామెజీ ఫిల్మ్ సిటీలో నిర్వహిస్తున్నారు. వీరి కాంబోలో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ సినిమాపై దేశ విదేశాల్లో అసాధారణమైన హైప్ క్రియేట్ అయ్యింది. ఇందులో మహేష్ ఎలా కనిపించనున్నాడు? లుక్ ఎలా ఉండబోతుంది ? అసలు సినిమా టైటిల్ ఏంటీ ? అనే ప్రశ్నలు సినీప్రియుల మదిలో వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఈ సినిమా గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. కానీ మొదటి నుంచి అసలు ఇంత భారీ బడ్జెట్ సినిమాను రూపొందిస్తున్న నిర్మాత గురించి ఎవరికీ తెలియదు.

Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..

ఈ సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నిర్మాత గురించి జనాలకు అంతగా తెలియదు. అలాగే ఆయన సినీరంగంలో అంతగా యాక్టివ్ కాదు. కానీ ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. క్షణ క్షణం, హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, సంతోషం వంటి సినిమాలు నిర్మించి భారీ విజయాలను అందుకున్నారు. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ చాలా కాలంగా సినిమా ప్రపంచంలో అంతగా యాక్టివ్ గా లేరు. ఎన్టీఆర్ తో రాఖీ తర్వాత ఆయన రెండు ప్రాజెక్ట్ ఆగిపోయాయి. కానీ అప్పుడే మహేష్, రాజమౌళి కాంబోను ఫిక్స్ చేశారట.

ఇవి కూడా చదవండి

గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “15 క్రితమే మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేస్తానని నాకు రాజమౌళి మాటిచ్చారు. అప్పటికే రాజమౌళి బిజీగా ఉండగా.. బాహుబలి వంటి ప్రాజెక్టులకు ఎన్నో సంవత్సరాలు కేటాయించాల్సి వచ్చింది.. ఆ తర్వాత కోవిడ్ ప్రభావం.. ఇలా వరుస అడ్డంకులతో ఈ కాంబో చాలా కాలం ఆలస్యమయ్యింది. వీరిద్దరిపై క్రేజ్ ఈరోజు ఉన్న స్థాయిలో అప్పట్లో లేదు. అయితే ఇచ్చిన మాటను రాజమౌళి మార్చుకోలేదు. హాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చినా ముందు కేఎల్ నారాయణతో సినిమా చేస్తానని అన్నారు. అప్పటికీ సినిమా ఫిక్స్ అయ్యారు తప్ప కథ సిద్ధం చేయలేదు.. ఆర్ఆర్ఆర్ విడుదలయ్యాక తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ పై కసరత్తు చేశారు. ఇప్పుడు నాకు ఇచ్చిన మాట కోసం ఈ సినిమా చేస్తున్నారు” అంటూ చెప్పుకొచ్చారు. మరికొన్ని గంటల్లో SSMB 29 టైటిల్, మహేష్ బాబు పోస్టర్ రివీల్ చేయనున్నారు.

Bigg Boss 9 Telugu: సీన్ మారింది.. బిగ్‏బాస్ దుకాణం సర్దేయాల్సిందే.. ఓర్నీ మరి ఇంత అట్టర్‌ఫ్లాపా..