
గతేడాది ఉత్తర ప్రదేశ్ లో జరిగిన మహా కుంభమేళాలో పూసలు అమ్ముతూ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది మధ్యప్రదేశ్ కు చెందిన మోనాలిసా భోంస్లే. తన తేనేలాంటి కళ్లతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. ఈమె అందాన్ని చూసి పలువురు దర్శక నిర్మాతలు కూడా సినిమాలు చేసేందుకు ముందుకు వచ్చారు. కానీ ఈ బ్యూటీ మాత్రం సడెన్ గా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా మొహమ్మద్ ఫర్మాన్‌తో కలిసి పెళ్లిపీటలెక్కింది. బుధవారం (మార్చి 11) తీవ్ర నాటకీయ పరిస్థితుల మధ్య వీరి వివాహం జరగ్గా, అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. మరి అన్నిటికంటే ముందు అసలు ఈ మొహమ్మద్ ఫర్మాన్ ఎవరు ? మోనాలిసాతో అతనికి పరిచయం ఎలా మొదలైంది? ప్రేమ ఎలా పుట్టింది? సడెన్ గా ఎందుకు పెళ్లి చేసుకున్నారన్నదానిపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో మోనాలిసా- ఫర్మాన్ ల గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
రుద్రాక్ష పూసలు అమ్ముతూ జీవనం సాగించే మోనాలిసా మహా కుంభమేళాతో మంచి గుర్తింపు వచ్చింది. సినిమా పరిశ్రమ నుంచి కూడా అవకాశాలు వచ్చాయి. అయితే సినిమా రంగంలోకి అడుగు పెట్టిన తర్వాతనే ఆమెకు మొహమ్మద్ ఫర్మాన్ కలిశాడు. ఫర్మాన్ కూడా సినిమా రంగానికి చెందిన వ్యక్తే. ఉత్తర ప్రదేశ్ కు చెందిన అతను మోడల్ గా, నటుడిగా రాణిస్తున్నాడు. మొహమ్మద్ ఫర్మాన్- మోనాలిసా భోంస్లే సోషల్ మీడియా ద్వారా కలుసుకున్నారు. ఆ తరువాత వారు షూటింగ్ సెట్‌లో కలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 6 నెలల పాటు డేటింగ్ చేసిన తర్వాత, వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇద్దరూ వేర్వేరు మతాలకు చెందిన వారు కావడంతో వారి పెద్దలు వివాహానికి అంగీకరించలేదు. అయినా తల్లిదండ్రులను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు మోనాలిసా- ఫర్మాన్.
విశేషమేమిటంటే మొహమ్మద్ ఫర్మాన్ కు మొదట ప్రపోజ్ చేసింది మోనాలిసా భోంస్లేనే అట! పెళ్లి తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో ఫర్మాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మోనాలినా ప్రపోజ్ చేసింది. నేను మొదట అంగీకరించలేదు. కానీ ఆ తర్వాత ఆమె ప్రేమ చూసి నేను ఒకే చెప్పాను. ఈ ఆరు నెలలు మాపై 60 సంవత్సరాల ప్రేమగా అనిపించింది. అందుకే మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. కేరళలోని ఒక ఆలయంలో హిందూ మతం ప్రకారం వివాహం జరిగింది. ‘ అని మొహమ్మద్ ఫర్మాన్ పేర్కొన్నాడు.
#Monalisa Bhonsle, who became an overnight internet sensation during the #MahaKumbhMela, #Prayagraj, Married her Boyfriend Farman in #Kerala
Before Marriage #MonalisaBhonsle approached the police in #Thiruvananthapuram (or #Trivandrum) on Wednesday seeking protection to stay… pic.twitter.com/LHH5qLVjhq
— Surya Reddy (@jsuryareddy) March 11, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.