Vishal Chakra Movie : విశాల్ హీరోగా సైబర్ క్రైమ్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న మూవీ చక్ర. ఎంఎస్ ఆనందన్ బాలసుబ్రమణ్యం దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. హీరోయిన్ రెజీనా కసాండ్ర, మనోబాలా, రోబో శంకర్, కెఆర్ విజయ్, సృష్టిడాంగే తదితరులు నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా.. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 19న విడుదల కావాల్సి ఉంది. అయితే మద్రాస్ హైకోర్టు ఇచ్చిన స్టేతో సినిమా విడుదలను కాదని అంతా భావించారు.
అయితే ఈ సినిమా అనుకున్న తేదీలోవిడుదల అవుతుందని విశాల్ తెలిపారు. ఈ విషయం పై విశాల్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. మద్రాస్ కోర్టు స్టేను కొట్టివేయడంతో ఈ సినిమా రిలీజ్ కు రూట్ క్లియర్ అయ్యింది. నిజం ఎప్పటికైనా గెలుస్తుందని ఈ సినిమా విడుదల విషయంలో కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ నిర్మాతకు మాత్రమే కాకుండా బృందం మొత్తానికి సంతోషాన్ని కలిగించిందని విశాల్ ట్వీట్ లో పేర్కొన్నాడు.
All Clear for #Chakra –
Grand Worldwide Release Tomorrow #ChakraFromTomorrow#ChakraKaRakshak#VishalChakra pic.twitter.com/eWxJKrwJ8y
— Vishal (@VishalKOfficial) February 18, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :
K. Viswanath : తెలుగు సినిమాకు గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన దర్శక దిగ్గజం కళాతపస్వి కె.విశ్వనాథ్