AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maremma Pre-Release Event : రవితేజగారు నాకు పెదనాన్న కాదు, ఆయన నాకు ఒక అన్నయ్య : మాధవ్

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా 'మారెమ్మ'తో హీరోగా పరిచయం అవుతున్నారు. మంచాల నాగరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మోక్ష ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మయూర్ రెడ్డి బండారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Maremma Pre-Release Event : రవితేజగారు నాకు పెదనాన్న కాదు, ఆయన నాకు ఒక అన్నయ్య : మాధవ్
Maremma
Rajeev Rayala
|

Updated on: Sep 05, 2026 | 10:38 PM

Share

మాధవ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా మారెమ్మ. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో మాధవ్  మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. రవితేజ గారి అభిమానులందరికీ నమస్కారం. చిన్నప్పటి నుంచి రవితేజ గారిని చూసే పెరిగాను. ఆయన నా ఫస్ట్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నాకు పెదనాన్న కాదు, ఆయన నాకు ఒక అన్నయ్య. మీ అందరికీ ట్రైలర్, టీజర్ ఎంత బాగా నచ్చిందో సినిమా కూడా అంతే బాగా నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఈ సినిమాతో మీ అందరికీ పరిచయం అవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఇందులో ఒక మనిషికి దున్నపోతు ఉన్నా హ్యూమన్ ఎమోషన్ చూస్తారు. డైరెక్టర్ గారు అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించారు. అలాగే మా నిర్మాతలు మయూర్, కుశాల్ గారికి థాంక్యూ. ఈ సినిమాలో క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. దీప అద్భుతంగా నటించింది. వికాస్ విలన్ క్యారెక్టర్‌లో ఇరగదీశాడు. అలాగే ప్రశాంత్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సెప్టెంబర్ 10న థియేటర్స్‌లో కలుద్దాం. జై మారెమ్మ.

Jabardasth Komaram: జబర్దస్త్‌లో నాకు లైఫ్ ఇచ్చి, అన్నం పెట్టింది ఆయనే.. ఆ అన్న వల్లే ఇప్పుడు ఇదంతా

హీరోయిన్ దీప బాలు మాట్లాడుతూ.. “మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన రవితేజ గారికి చాలా థాంక్యూ.ఈ అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. మాధవ్ ఎంతో క్రమశిక్షణతో అద్భుతంగా ట్రాన్స్‌ఫర్మ్ అయ్యారు. తనకు చాలా పెద్ద విజయం రావాలని కోరుకుంటున్నాను. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుంది .

మంచి ఛాన్స్ మిస్ అయ్యాయంది.. ఆ సినిమా చేయలేకపోయా అని చాలా ఫీల్ అయ్యా..

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా ‘మారెమ్మ’తో హీరోగా పరిచయం అవుతున్నారు. మంచాల నాగరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మోక్ష ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మయూర్ రెడ్డి బండారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. టీజర్, ట్రైలర్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 10 ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు మాస్ మహారాజా రవితేజ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

8 ఏళ్లుగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సినిమా.. రూ.25 కోట్లు పెడితే రూ.180 కోట్లు వచ్చాయి.. ఇప్పటికీ ఓటీటీలో ట్రెండింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us