
చిన్న సినిమాలుగా వచ్చిన చాలా సినిమాలు సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అలాంటి వాటిలో పొలిమేర సినిమా ఒకటి. చిన్న సినిమాగా వచ్చిన మా ఊరి పొలిమేర సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పొలిమేర 2ను థియేటర్స్ లో రిలీజ్ చేశారు. మొదటి పార్ట్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో పొలిమేర 2 పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే మొదటి పార్ట్ ను అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. దాంతో పొలిమేర 2 పై ప్రేక్షకులకు క్యూరియాసిటీ పెరిగింది.
థియేటర్స్ లో రిలీజ్ అయిన పొలిమేర 2 అభిమానుల అంచనాలను ఆశించిన స్థాయిలో అందుకోలేకపోయింది. సినిమా పర్లేదు అనిపించుకున్నా.. మొదటి పార్ట్ అంతగా ఆకట్టుకోలేకపోయింది అన్నది చూసిన వారి మాట. ఇక ఇప్పుడు పులిమేర 2 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఓటీటీలో ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది.
ఓటీటీలో మా ఊరి పొలిమేర 2 సినిమా ఇప్పటి వరకూ 100 మిలియన్స్ కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్నీ ఆహా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. మా ఊరి పొలిమేర సినిమాలో సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ఓటీటీలో ఇంకెన్ని రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
OTT Box Office records ni tiraga rasina #Polimera. E bomma blockbuster. Watch #Polimera2 NOW!▶️https://t.co/sH6NwsXv7p@Satyamrajesh2 #kamakshiBhaskarla @DrAnilviswanath @Connect2vamsi @Gowrkriesna @getupsrinu3 #ahaGold #Polimera2 pic.twitter.com/LhRuepYeHv
— ahavideoin (@ahavideoIN) December 12, 2023
Pooja Prarambham!☠️
Thrilling Sambhavami😨#Polimera2 Streaming Now▶️https://t.co/EjVZhevzG5 @Satyamrajesh2 #kamakshiBhaskarla @DrAnilviswanath @Connect2vamsi @Gowrkriesna @getupsrinu3 #ahaGold #Polimera2 pic.twitter.com/VdxmiVx5sG— ahavideoin (@ahavideoIN) December 7, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..