AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: అర్జున్ కాళ్లు పట్టుకోబోయిన యావర్.. సారి అన్న అంటూ ఎమోషనల్

శివాజీ, యావర్, అమర్ దీప్, అర్జున్ , ప్రశాంత్ , ప్రియాంకాల జర్నీని చూపించాడు. ఒకొక్కరిని హౌస్ లాన్ లోకి పిలిచి హౌస్ లో వారి హ్యాపీ మూమెంట్స్ ను ఫొటోస్ ద్వారా చూపించాడు. దాంతో హౌస్ మేట్స్ ఎమోషనల్ అయ్యారు. అలాగే వారిని పొగడ్తలతో ముంచెత్తారు. ముందుగా హౌస్ పెద్దరాయుడు శివాజీని పిలిచాడు బిగ్ బాస్. శివాజీకి సర్‌ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్.

Bigg Boss 7 Telugu: అర్జున్ కాళ్లు పట్టుకోబోయిన యావర్.. సారి అన్న అంటూ ఎమోషనల్
Bigg Boss 7
Rajeev Rayala
|

Updated on: Dec 13, 2023 | 7:30 AM

Share

బిగ్ బాస్ ఉల్టా పుల్టా సీజన్‌  చివరి దశకు వచ్చేసింది. చివరి వారం కావడంతో హౌస్ లో ఉన్న ఆరుగురిని సర్ ప్రైజ్ చేశాడు బిగ్ బాస్. శివాజీ, యావర్, అమర్ దీప్, అర్జున్ , ప్రశాంత్ , ప్రియాంకాల జర్నీని చూపించాడు. ఒకొక్కరిని హౌస్ లాన్ లోకి పిలిచి హౌస్ లో వారి హ్యాపీ మూమెంట్స్ ను ఫొటోస్ ద్వారా చూపించాడు. దాంతో హౌస్ మేట్స్ ఎమోషనల్ అయ్యారు. అలాగే వారిని పొగడ్తలతో ముంచెత్తారు. ముందుగా హౌస్ పెద్దరాయుడు శివాజీని పిలిచాడు బిగ్ బాస్. శివాజీకి సర్‌ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. హౌస్ లో తన జర్నీని చూసి ఎమోషనల్ అయ్యాడు శివాజీ. తన 25 ఏళ్ల సినీ కెరీర్ ఒకెత్తూ.. బిగ్ బాస్ హౌస్ ఎక్స్ పీరియన్స్ ఒకెత్తూ అని తెలిపాడు శివాజీ.

అలాగే లాన్ లో కాఫీ పొడి డబ్బా కూడా పెట్టిన బిగ్‌బాస్.. కాఫీని ఎంజాయ్ చేయండి.. అంటూ నవ్వులు పూయించాడు. శివాజీ మాట్లాడుతూ.. మనల్ని మనం తెలుసుకోవాలి.. కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలనేది ఈ వచ్చాకే తెలిసింది అని అన్నాడు బిగ్ బాస్. చాలా నేర్చుకున్నాను.. చాలు కప్పు గెలస్తామా లేదా అనేది అనవసరం.. కానీ ప్రజల హృదయాలు మాత్రం ఈ ఆరుగురు గెలిచారనేది నేను బలంగా నమ్ముతాను అని అన్నాడు.

మీ గాయం మిమ్మల్ని ఎంత బాధించినా ఓటమి వైపు చూడలేదు.. మీ అబ్బాయే మీ డాక్టర్‌గా వచ్చినప్పుడు మీ బాధని అంతా మర్చిపోయారు.. అప్పటి నుంచి పూర్తి శ్రద్ధ లక్ష్యంపై పెట్టారు.. అంటూ శివాజీని ‘పొగడ్తలతో ముంచెత్తాడు బిగ్ బాస్. ఆతర్వాత కిచన్ లో యావర్, శివాజీ ఉండగా అర్జున్ వచ్చి వెనకనుంచి యావర్ ను హగ్ చేసుకున్నాడు. నేను అస్సలు అనుకోలేదు వీడిది నా వీడియోలో అంతబాగా చూపిస్తారని అని అన్నాడు అర్జున్. దానికి యావర్ ఓ నవ్వు నవ్వు తిరిగి అర్జున్ ను హగ్ చేసుకున్నాడు. సారి అన్న అంటూ అర్జున్ కాళ్లు పట్టుకొబోయాడు యావర్. ఇంతలో వద్దురా అంటూ యావర్ ను హగ్ చేసుకున్నాడు అర్జున్. అక్కడే ఉన్న శివాజీ కూడా ఇది చూసి ఎమోషనల్ అయ్యాడు.  ఎందుకు కలుస్తామో తెలీదు.. ఎందుకు కొట్టుకుంటామో తెలీదు.. అన్నాడు శివాజీ. యావర్, అర్జున్ సరిగ్గా మాట్లాడుకోవడంలేదన్న విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టీ20ల్లో ఎవరికీ వల్ల కాని చెత్త రికార్డు సాధించిన ఆసిస్ కెప్టెన్
టీ20ల్లో ఎవరికీ వల్ల కాని చెత్త రికార్డు సాధించిన ఆసిస్ కెప్టెన్
2027లో తొలి సూర్యగ్రహణం ఎప్పుడు? భారత్‌లో కనిపిస్తుందా.. సూతక..
2027లో తొలి సూర్యగ్రహణం ఎప్పుడు? భారత్‌లో కనిపిస్తుందా.. సూతక..
 ఎక్కిళ్లు వెంటనే తగ్గాలంటే ఈ చిన్న చిట్కాతో వెంటనే బంద్!
 ఎక్కిళ్లు వెంటనే తగ్గాలంటే ఈ చిన్న చిట్కాతో వెంటనే బంద్!
నోటి నుంచి చెడు వాసన వస్తోందా? ఆయుర్వేదంలో సూచించిన ఈ చిట్కాలు
నోటి నుంచి చెడు వాసన వస్తోందా? ఆయుర్వేదంలో సూచించిన ఈ చిట్కాలు
నెయిల్ పాలిష్ వేసినా అందంగా కనిపించడం లేదా? ఈ పొరపాట్లు చేయకండి!
నెయిల్ పాలిష్ వేసినా అందంగా కనిపించడం లేదా? ఈ పొరపాట్లు చేయకండి!
మీ మంచితనాన్ని అలుసుగా తీసుకుంటున్నారా? ఇది నేర్చుకోండి!
మీ మంచితనాన్ని అలుసుగా తీసుకుంటున్నారా? ఇది నేర్చుకోండి!
తిరుపతికి ప్రధాని మోదీ.. డిసెంబర్ 4 నుంచి మూడు రోజుల పర్యటన..
తిరుపతికి ప్రధాని మోదీ.. డిసెంబర్ 4 నుంచి మూడు రోజుల పర్యటన..
లైవ్ మ్యాచ్‌లో అంపైర్ మీదకు దూసుకెళ్లిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్
లైవ్ మ్యాచ్‌లో అంపైర్ మీదకు దూసుకెళ్లిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్
ఉడకబెట్టిన గుడ్డు వర్సెస్ ఆమ్లెట్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్?
ఉడకబెట్టిన గుడ్డు వర్సెస్ ఆమ్లెట్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్?
పెళ్లి కోసం లోన్ తీసుకుంటున్నారా ? ఇవి మిస్ అయితే జేబు ఖాళీనే !!
పెళ్లి కోసం లోన్ తీసుకుంటున్నారా ? ఇవి మిస్ అయితే జేబు ఖాళీనే !!