MAA Elections 2021: ముదురుతున్న ‘మా’ వివాదం.. ‘మా’ ప్రతిష్టను దిగజార్చుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్న మాణిక్

|

Aug 14, 2021 | 1:27 PM

మా ఎన్నికల వేడి రోజురోజుకు రాజుకుంటుంది. అందరికంటే ఒక అడుగు ముందుకేసి ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అంతే కాదు తన ప్యానల్‌‌‌ను కూడా..

MAA Elections 2021: ముదురుతున్న మా వివాదం.. మా ప్రతిష్టను దిగజార్చుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్న మాణిక్
Follow us on

MAA Elections 2021: మా ఎన్నికల వేడి రోజురోజుకు రాజుకుంటుంది. అందరికంటే ఒక అడుగు ముందుకేసి ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అంతే కాదు తన ప్యానల్‌‌‌ను కూడా అనౌన్స్ చేశారు ప్రకాష్ రాజ్. అదే సమాయంలో వెంటనే తాను కూడా పోటీకి రెడీ అంటూ మంచు విష్ణు రంగంలోకి దిగారు. మా లో చాలా సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించడానికి కృషిచేస్తానని విష్ణు చెప్పుకొచ్చారు. అలాగే మా కు సొంత బిల్డింగ్ ఏర్పాటు గురించి కూడా చర్చ జరుగుతోంది. ఈ సారి ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. మరో నలుగురిలో హేమ- జీవిత- సీవీఎల్ వంటి వారు రేసులో ఉన్నారు. ఇదిలా ఉంటే నటి హేమ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. మా నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆమె ఆరోపించింది. ఆ ఆరోపణలపై సీనియర్ నరేష్ సీరియస్‌‌‌గా స్పందించారు. నిబంధనలను ఉల్లంఘించిన హేమ పై క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే జీవిత  రాజశేఖర్ కూడా హేమ పై ఫైర్ అయ్యారు. తాజాగా నిబంధనలను ఉల్లంఘించిన కొందరు మా సభ్యుల పై క్రమ శిక్షణ సంఘం చైర్మన్ కృష్ణంరాజుకి పిర్యాదు చేశారు మా సభ్యులు. దాదాపు వందకు పైగా సభ్యుల సంతకాలతో ఫిర్యాదును సిద్ధం చేశారు. ఈ వ్యవహారం పై మా ఫౌండర్ మెంబర్ మాణిక్ మాట్లాడుతూ..నరేష్‌‌‌కు మా నిధులు కాజేయాల్సిన పనిలేదు అన్నారు. నిస్వార్థంగా నరేష్ మా కు సేవచేస్తున్నారని, నరేష్ పై బురదజల్లడం మానుకోవాలి.. ఇలాంటివారిపై క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకోవాలిని ఆయన కోరారు.

అలాగే మంచు విష్ణు సమర్థుడు.. అతన్ని ఏకగ్రీవంగా మా అధ్యక్ష్యుడిగా ఎన్నుకోవాలి, మంచు విష్ణు మా.. వైస్ ప్రెసిడెంట్‌‌‌గా బాగా పనిచేశారు అని కితాబిచ్చారు. ఇక మా ప్రతిష్టను దిగజార్చుతున్న వారిపై క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకోవాలి, మాలో సభ్యులుగా ఉండి .. మా ను అవమానిస్తున్న వారి పక్కన నిలబడటం పద్దతికాదు, ఇది మా నిబంధనలు ఉల్లంఘించడమే అంటూ మండిపడ్డారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిమీద చర్యలు తీసుకోవాలని, మా ఎన్నికలు జరిపించాలని 110మంది సభ్యుల సంతకాలతో .. మా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కృష్ణంరాజుకు వినతి పత్రం అందజేయనున్నామని మాణిక్ తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఆన్ లైన్‌‌‌‌లో చక్కర్లు కొడుతున్న నటి ప్రైవేట్‌ వీడియో.. దయచేసి వీడియోను తీసివేయండి అంటూ ఆవేదన

Vishwak Sen: ఆ మాటకు ఇంకా కట్టుబడే ఉన్నాను.. సినిమాకు ప్రమోషన్స్‌ కూడా అవసరం లేదంటున్నారు. విశ్వక్‌ సేన్‌ వ్యాఖ్యలు.

ఈ బుజ్జాయి ఇప్పుడు టాలీవుడ్‌‌‌లో నెంబర్ వన్ హీరోయిన్.. గెస్ చేయడం కష్టమే.. కావాలంటే ట్రై చేయండి..