MAA Elections 2021: అసలైన సిని’మా’ అప్పుడే.. మా ఎన్నికల తర్వాత టాలీవుడ్ సినీ పరిశ్రమలో అసలేం జరగబోతుంది..

|

Oct 09, 2021 | 7:12 PM

ఎట్టకేలకు తీర్పు రాబోతుంది. గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమలో జరుగుతున్న సిని'మా' రాజకీయాలకు రేపటితో ముగింపు రాబోతుంది.

MAA Elections 2021: అసలైన సినిమా అప్పుడే.. మా ఎన్నికల తర్వాత టాలీవుడ్ సినీ పరిశ్రమలో అసలేం జరగబోతుంది..
Maa Elections
Follow us on

ఎట్టకేలకు తీర్పు రాబోతుంది. గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమలో జరుగుతున్న సిని’మా’ రాజకీయాలకు రేపటితో ముగింపు రాబోతుంది. అక్టోబర్ 10న ఎన్నికలు జరగడం.. అదే రోజు ఫలితాలు రావడం జరిగిపోనున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి మా ఎలక్షన్స్ రసవత్తరంగా సాగుతున్నాయి. ఆరోపణలు, సవాల్లతో మా ప్రతిష్ట రోడ్డున పడుతుందని సీనియర్స్ చెబుతున్న.. క్రమశిక్షణ కమిటీ హెచ్చరిస్తున్న అభ్యర్థులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. చిన్నగా మొదలైన విమర్శల దాడి చిలికి చిలికి గాలివానగా మారింది. ఓట్లు వేయండి అంటూ అభ్యర్థించడం కాకుండా.. విమర్శలు, ఆరోపణలు, ఫిర్యాదులపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు ఈసారి బరిలో ఉన్న అభ్యర్థులు. ఇక గతంలో మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు సాధారణంగా జరిగిపోయాయి కానీ ఈసారి అలా కాదు.. సీన్ మొత్తం రివర్స్ .. చిత్రపరిశ్రమలో మెగా ఫ్యామిలీ వర్సెస్ మంచు ఫ్యామిలీ అన్నట్టుగా సాగుతుంది. నిజానికి మా ఎన్నికలల్లో చిరు కుటుంబం నుంచి ఎవరు పోటీ చేయడం లేదు.. పోటీ మొత్తం ప్రకాష్ రాజ్ మరియు మంచు విష్ణు మధ్యే.. అయితే ఇందులో ప్రకాష్ రాజ్‏కు మద్దతుగా మెగా ఫ్యామిలీ ఉంది అనేది ముందు నుంచి వస్తున్న సమాచారం. దీంతో ఇప్పుడు టాలీవుడ్ సిని’మా’ ఎన్నికలు ఉత్కంఠంగా మారాయి…

ఇదిలా ఉంటే.. రేపు జరగపోయే ఎన్నికల తర్వాత సిని’మా’ పరిశ్రమలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కలుగుతున్న సందేహాలు. టాలీవుడ్‏లో మా ఎన్నికలు పెట్టిన చిచ్చు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ప్రధానంగా సినీ పెద్దల మధ్య కొనసాగుతున్న నిశ్శబ్ద యుద్ధం కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ప్రకాష్ రాజ్‏కు మెగా ఫ్యామిలీ మద్దతు ఇవ్వడంతో మంచువర్గం కాస్త అసహనంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మెగా బ్రదర్ నాగబాబు, మోహన్ బాబు మధ్య నడుస్తున్న మాటల యుద్ధం కూడా తర్వాత పరిస్థితులు ఎలా ఉండునున్నాయి అనేది కూడా మరో సందేహం. రేపు జరగబోయే ఎన్నికలలో ఎవరు గెలుస్తారు.. ప్రకాష్ రాజ్ గెలిస్తే.. పరిస్థితులు ఏంటీ.. మంచు విష్ణు గెలిస్తే పరిస్థితులు ఏంటీ.. ఎవరు గెలిచినా..సినీ పెద్దల మధ్య తలెత్తిన మనస్పర్థలు కొనసాగుతాయా ? లేదా ఇక్కడితోనే ఫుల్‏స్టాప్ పెడతారా ? అనేది చూడాలి.

Also Read: Maha Samudram: శర్వానంద్, సిద్ధార్థ్ మహా యుద్ధం.. మహా సముద్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..

Viral Photo: ఈ ఫోటోలో కెమెరావైపు చూస్తోన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? కళ్లలో కనిపిస్తున్న ఆ ధైర్యమే ఆమె మారు పేరు.