AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ ఫోటోలో కెమెరావైపు చూస్తోన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? కళ్లలో కనిపిస్తున్న ఆ ధైర్యమే ఆమె మారు పేరు.

Viral Photo: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు, వారి అభిమానులకు మధ్య దూరంగా పూర్తిగా తగ్గిపోతోంది. ఒకప్పుడు తమ అభిమాన నటీ, నటులు ఫోటోలు చూడాలంటే పోస్టర్‌లు లేదా వార్త పత్రికల్లో..

Viral Photo: ఈ ఫోటోలో కెమెరావైపు చూస్తోన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? కళ్లలో కనిపిస్తున్న ఆ ధైర్యమే ఆమె మారు పేరు.
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 09, 2021 | 6:29 PM

Viral Photo: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు, వారి అభిమానులకు మధ్య దూరంగా పూర్తిగా తగ్గిపోతోంది. ఒకప్పుడు తమ అభిమాన నటీ, నటులు ఫోటోలు చూడాలంటే పోస్టర్‌లు లేదా వార్త పత్రికల్లో మాత్రమే అవకాశం ఉండేది. వాటిని కత్తిరించి జాగ్రత్తగా దాచుకునే వారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సినీ తారలే సోషల్‌ మీడియాలో లైవ్‌లోకి వచ్చి తమ అభిమానులతో ముచ్చటిస్తున్నారు. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు. సెలబ్రిటీ హోదాను సైతం పక్కన పెట్టి వారి చిన్ననాటి ఫోటోలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల తారలు తమ చిన్ననాటి ఫోటోలను పంచుకోవడం ఒక ట్రెండ్‌లా నడుస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా ఓ అందాల నటి తన చిన్ననాటి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. తమ్ముడి పుట్టిన రోజును పురస్కరించుకొని చిన్న తనంలో దిగిన ఓ ఫోటోను షేర్‌ చేసింది. ఇంతకీ పైన కనిపిస్తోన్న ఫోటోలో ఉన్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? కెమెరాకు తదేకంగా చూస్తూ ఏమాత్రం భయం లేనట్లు కనిపిస్తోంది కదూ.! ఆ చిన్నారికి పెరిగి, పెద్దదైనా ఇప్పటికీ ఎలాంటి భయం లేకుండానే ఉంది. తన ముక్కుసూటి తనం, భయంలేని తత్వ్తంతో ఏకంగా వ్యవస్థతోనే పోరాటానికి దిగింది. ఇలా నిత్యం ఏదో కాంట్రవర్సీతో హల్చల్‌ చేస్తూనే ఉంది.

ఇంతకీ ఆ చిన్నారి ఎవరో ఈ పాటికే మీకు అర్థమైఉండాలి. అవును..! మీరు అనుకుంటోంది నిజమే.. తాను కంగనా రనౌత్‌. సమాజంలో జరుగుతోన్న సంఘటనలపై ముక్కుసూటి తనంతో కుండ బద్దలు కొట్టేలా మాట్లాడుతూ.. టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచే కంగానానే. తాజాగా కంగనా.. సోదరుడు పుట్టిన రోజు. ఈ నేపథ్యంలోనే చిన్న తనంలో తమ్ముడితో దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ.. ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది. ఇదిలా ఉంటే ఇటీవల జయ లలిత బయోపిక్‌తో ప్రేక్షకులను పలకరించిన కంగనా.. తాజాగా నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి అమీర్‌ ఖాన్‌ కారణమంటూ వ్యాఖ్యలు చేసి మరోసారి పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.

Also Read: After Divorce Samantha: తీపి జ్ఞాపకాలలో ఒంటరిగా ‘సమంత’ ప్రయాణం.. విడాకుల తర్వాత సామ్ షేర్ చేసి ఫోటోస్..

Navratri 4rd Day Naivedyam: రేపు నవరాత్రుల్లో నాలుగో రోజు.. అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు.. తయారీ ఎలా అంటే..

Vitamin D Deficiency: ఈ లక్షణాలు తరచుగా మీలో కనిపిస్తున్నాయా.. అయితే ‘డి విటమిన్’ లోపం ఏమో చెక్ చేసుకోండి..