MAA Elections 2021: కథ క్లైమాక్స్‌కు వచ్చింది. మా ఎన్నికలకు ఇంక కేవలం 24 గంటలు మాత్రమే సమయం ఉంది. ఎంతైనా మా సిత్రం కదా.. క్లైమాక్స్ మరింత ఇంట్రస్టింగ్‌గా.. అంతకు మించిన టర్నింగ్ పాయింట్లతో మా ఎపిసోడ్ టర్న్ అవుతోంది. విష్ణు వర్సెస్ మోనార్క్ ఫైట్ పీక్ స్టేజ్‌లో ఉన్న ఈ సమయంలో టీవీ9 బిగ్ డిబేట్ వేదికగా.. సరికొత్త ఫార్ములా తెరపైకి వచ్చింది. మా ఎన్నికల్లో వినూత్నంగా రాజీ ఫార్ములాను తైరపైకి తెచ్చారు శివాజీరాజా. సినీ పెద్దలు చొరవతీసుకుని.. ఏకగ్రీవానికి ప్రయత్నించాలన్నది శివాజీరాజా విన్నపం. బైలాస్‌లో మార్పులు చేసి.. పదవీ కాలాన్ని నాలుగేళ్లకు పెంచాలట. అందులో రెండేళ్లు మంచు విష్ణు.. మరో రెండేళ్లు ప్రకాష్‌రాజ్ ఉండేలా చూడాలన్నది ఆయన మనోగతం. చెరో రెండేళ్లు అధ్యక్ష.. ప్రధాన కార్యదర్శులుగా ఉండేలా చూడాంటున్నారు శివాజీరాజా.
శివాజీరాజా.. మాటలకే పరిమితం కాలేదండోయ్. మాజీ అధ్యక్షుడిగా తను కూడా బాధ్యత తీసుకుంటారట. రాజీ ఫార్ములాకు ఓ ప్యానల్‌ను ఒప్పించేందుకు ఆయన సంసిద్ధంగా ఉన్నానంటూ టీవీ9 వేదికలో చెప్పుకొచ్చారు. ఇక విష్ణుని గెలిపించాలంటూ మోహన్ బాబు రాసిన లెటర్‌పై సినీ సర్కిల్‌లో తెగ చర్చ జరుగుతోంది. నటులతో పాటు నటుడిని.. ప్రొడ్యూసర్లతో పాటు ప్రొడ్యూసర్ని.. దాసరి అడుగు జాడల్లో నడుస్తున్న ఆయన బిడ్డను.. కష్టమొచ్చిన ప్రతిసారీ.. అండగా నిలబడినవాడిని.. నేను మాటిస్తున్నా.. ఏ సమస్య వచ్చినా విష్ణు అండగా ఉంటాడు.. నా కుమారునికి ఓటేసి గెలిపించండి.. అంటూ మోహన్ బాబు రాసిన లెటర్.. తెగ సర్కిల్ అవుతోంది. ప్రకాశ్ రాజ్‌నే గెలిపించాలంటూ.. నాగబాబు మరోసారి స్క్రీన్ మీదకు వచ్చారు. అనుభవజ్ఞుడిగా.. అన్నీ తెలిసిన వాడిగా ప్రకాశ్ రాజ్‌కే అన్ని అర్హతలు ఉన్నాయన్నది ఆయన వాదన. మా లో మరో ట్విస్ట్ ఏంటంటే.. మా సభ్యత్వానికి సీవీఎల్ రాజీనామా. ప్రకాష్‌రాజ్‌ను క్షిమించాలని కోరారు. ప్రకాశ్ రాజ్ హిందూ వ్యతిరేకి.. ఆయనను ఓడించాలంటూ పెద్ద ఎత్తున పిలుపుఇచ్చిన సీవీఎల్.. సడెన్‌గా సభ్యత్వానికి రాజీనామా చేశారు.
మరిన్ని ఇక్కడ చదవండి :