Maa Elections 2021: రసవత్తరంగా మా ఎలక్షన్స్.. మంచు విష్ణు ప్యానెల్ పై స్పందించిన నరేష్.. ఏమన్నారంటే..

|

Sep 23, 2021 | 5:05 PM

మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్స్ రోజు రోజూకీ రసవత్తరంగా మారుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న మా ఎన్నికలు జరుగనున్నాయి.

Maa Elections 2021: రసవత్తరంగా మా ఎలక్షన్స్.. మంచు విష్ణు ప్యానెల్ పై స్పందించిన నరేష్.. ఏమన్నారంటే..
Manchu Vishnu
Follow us on

మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్స్ రోజు రోజూకీ రసవత్తరంగా మారుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న మా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో బరిలో ఉన్న అభ్యర్థులతోపాటు.. సినీ పరిశ్రమలోని అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. నువ్వా.. నేనా అన్నట్టుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మా అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, సీవిఎల్ బరిలో ఉన్నారు. ముఖ్యంగా ఇందులో మంచు విష్ణు. ప్రకాష్ రాజ్ మధ్య పోటీ ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఎన్నికల తేదీ దగ్గరపడుతుండడంతో.. అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులను ప్రకటించారు. తాజాగా ఈరోజు మంచు విష్ణు తన ప్యానల్ సభ్యులను ప్రకటించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు మంచు విష్ణు మా కోసం మనమందరం పేరుతో తన ప్యానల్ సభ్యులను ప్రకటించారు.

అందులో మంచు విష్ణు.. అధ్యక్షుడిగా.. రఘుబాబు జనరల్ సెక్రటరీ, బాబు మోహన్.. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయనున్నారు. అలాగే మాదాల రవి..వైస్ ప్రెసిడెంట్, పృథ్వీరాజ్ బాలిరెడ్డి.. వైస్ ప్రెసిడెంట్, శివబాలాజీ.. కోశాధికారి, కరాటే కళ్యాణి..జాయింట్ సెక్రటరీ, గౌతమ్ రాజు. . జాయింట్ సెక్రెటరీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా.. అర్చన, అశోక్ కుమార్, గీతా సింగ్, హరినాథ్ బాబు, జయవాణి, మలక్ పేట్ శైలజ, మాణిక్, పూజిత, రాజేశ్వరీ రెడ్డి, సంపూర్ణేష్ బాబు, శశాంక్, శివన్నారాయణ, శ్రీలక్ష్మి, శ్రీనివాసులు, స్వప్న మాధురి, విష్ణు బొప్పన్న వడ్లపట్ల, రేఖ ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా మంచు విష్ణు ప్యానల్ పై ప్రస్తుత మా అద్యక్షుడు స్పందించాడు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశాడు . అందులో నరేష్ మాట్లాడుతూ… విష్ణును అభినందించాడు.. మంచు విష్ణు ప్యానల్ బాగుందని.. ఫ్రేష్‏గా ఉంది.. కాంట్రవర్సెల్ సభ్యులు ఎవరు లేరు. ముఖ్యంగా అన్ని ప్రాంతాల వారికీ ప్రాముఖ్యత ఇచ్చారు. మహిళలకు ప్రాధాన్యతనిచ్చారు. అలాగే అందరు చదువుకున్న వారు, యువకులు, అనుభవజ్ఞులను ఎంపిక చేసుకోవడం బావుందని.. ఎన్నికలలో విష్ణుకు విజయం సాధించాలను కోరుకుంటూ. విష్ణుకు ఆల్‌ ది బెస్ట్ చెప్పారు.

వీడియో..

Also Read: Megha Akash: మేఘా ఆకాశ్ క్యూట్‌నెస్‌కు కుర్రకారు ఫిదా.. లేటెస్ట్ ఫోటో గ్యాలరీ వైరల్..

Kajal Aggarwal: బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోయిన చందమామ.. కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పిక్స్