MAA elections 2021:: ఎవరు గెలిచినా మన కుటుంబం గెలిచినట్టే.. విష్ణుకు అభినందనలు తెలిపిన మెగాస్టార్..

మా ఎన్నికలు మునుపెన్నడూ లేని విధంగా రసావత్రరంగా సాగాయి. అభ్యర్థుల మధ్య మాటల తూటాలు పేలాయి. మైకులు కనపడితే చాలు ఒకరి పై ఒకరు రెచ్చిపోయి రంకెలేసులున్నారు..

MAA elections 2021:: ఎవరు గెలిచినా మన కుటుంబం గెలిచినట్టే.. విష్ణుకు అభినందనలు తెలిపిన మెగాస్టార్..
Megastar

Edited By: Anil kumar poka

Updated on: Oct 11, 2021 | 12:27 PM

MAA elections 2021:: మా ఎన్నికలు మునుపెన్నడూ లేని విధంగా రసావత్రరంగా సాగాయి. అభ్యర్థుల మధ్య మాటల తూటాలు పేలాయి. మైకులు కనపడితే చాలు ఒకరి పై ఒకరు రెచ్చిపోయి రంకెలేసులున్నారు.. ప్రకాష్ రాజ్ ప్యానల్, మంచు విష్ణు ప్యానల్ సభ్యులు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూ నానా హంగామా చేశారు. మా ఎన్నికలను సాధారణ ఎన్నికలుగా మార్చేశారు. అయితే ఇప్పుడు ఉత్కంఠకు తెరపడింది. మా పదవి ఎవరిని వరిస్తుంది అన్నదానికి తెరపడింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికయ్యారు. ప్రకాష్ రాజ్ పై ఆయన 107 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికవ్వడంతో ఆయన అభిమానులు సంబరాలు జరుపుంన్నారు. ఇక ప్రకాష్ రాజ్ కూడా మంచు విష్ణుకు అభినందనలు తెలిపారు. అటు మోహన్ బాబు మాట్లాడుతూ ఇది అందరి విజయం అందరి ఆశీసులు నా బిడ్డకు కావాలని కోరారు. అలాగే ఇచ్చిన వాగ్దానాలను విష్ణు తప్పకుండా నెరవేరుస్తాడని మోహన్ బాబు తెలిపారు.

ఇక మా ఎన్నికల్లో విజయం సాధించిన మంచు విష్ణుకు సినిమా పరిశ్రముకు చెందిన వారితో పాటు పలువురు రాజకీయా నాయకులు కూడా అభినందనలు తెలుపుతున్నారు. తెలుగు దేశం పార్టీ నేత సోమిరెడ్డి సోషల్ మీడియా వేదికగా ‘ ప్రకాష్ రాజ్ చేసిన ఒకే ఒక కామెంట్ ఆయన్ని మా ఎన్నికల్లో ఓడిస్తోందని వారం క్రితమే మిత్రులతో షేర్ చేసుకున్నా.
విష్ణు వినయవిధేతలే ఆయన విజయానికి నాంది అవుతున్నాయని చెప్పా. ఈ రోజు అదే నిజమైంది..సీనియర్ల ఆశీస్సులు తనకు అవసరం లేదని ఇచ్చిన స్టేట్మెంట్ తో ప్రకాష్ రాజ్ ఓటమికి బాటలు వేసుకున్నారు. విజేతగా నిలిచిన విష్ణుకు అభినందనలు. ఆయనకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నా… అంటూ రాసుకొచ్చారు.

అటు మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించారు.. ‘మా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకు, ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ అయిన శ్రీకాంత్ అలాగే విజేతలందరికి నా అభినందనలు. నూతన కార్యవర్గం మూవీ ఆర్టిస్ట్ లందరి సంక్షేమానికి పాటుపడుతుందని ఆశిస్తున్నాను. మా ఇప్పటికీ ఎప్పటికీ ఒకటే కుటుంబం.. ఇందులో ఎవరు గెలిచినా మన కుటుంబం గెలిచినట్టే..ఆ స్ఫూర్తితోనే ముందుకు సాగుతామని నమ్ముతున్నాను’ అని మెగాస్టార్ చిరజీవి ట్వీట్ చేశారు.