MAA Elections 2021: విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానళ్లలో ఎవరెవరు ఉన్నారు? ‘మా’ బాక్సింగ్ రింగ్‌లో విజేత ఎవరు?

|

Oct 09, 2021 | 4:52 PM

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(MAA) ఎన్నికల హై ఓల్డేజ్ తారస్థాయికి చేరింది.  మా వార్‌కి మరికొన్ని గంటలే మిగిలింది. మా బాక్సింగ్‌ రింగ్‌లో విజేత ఎవరో? రేపు(ఆదివారం) తేలిపోనుంది.

MAA Elections 2021: విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానళ్లలో ఎవరెవరు ఉన్నారు? ‘మా’ బాక్సింగ్ రింగ్‌లో విజేత ఎవరు?
Maa Elections
Follow us on

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(MAA) ఎన్నికల హై ఓల్డేజ్ తారస్థాయికి చేరింది.  మా వార్‌కి మరికొన్ని గంటలే మిగిలింది. మా బాక్సింగ్‌ రింగ్‌లో విజేత ఎవరో? రేపు(ఆదివారం) తేలిపోనుంది. సభ్యలు మద్ధతు కూడగట్టుకునేందుకు ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు ప్యానళ్లు చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. వ్యూహ, ప్రతివ్యూహాలతో మా ఎన్నికల్లో విజయం కోసం శ్రమిస్తున్నారు. మరి మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానళ్లలో ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాం..

ప్రకాశ్ రాజ్ ప్యానల్…
అధ్యక్షుడు- ప్రకాశ్‌రాజ్‌
జనరల్‌ సెక్రటరీ: జీవితా రాజశేఖర్‌
ట్రెజరర్‌- నాగినీడు
జాయింట్‌ సెక్రటరీ: అనితా చౌదరి, ఉత్తేజ్‌
ఉపాధ్యక్షుడు: బెనర్జీ, హేమ
ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌: శ్రీకాంత్‌

ఎగ్జిక్యూటివ్‌ మెంబర్స్ జాబితా
1. అనసూయ, 2. అజయ్, 3. భూపాల్, 4. బ్రహ్మాజీ, 5. ప్రభాకర్ , 6. గోవింద రావు 7. ఖయూమ్, 8. కౌశిక్, 9. ప్రగతి, 10. రమణా రెడ్డి, 11. శివా రెడ్డి, 12. సమీర్ 13. సుడిగాలి సుధీర్, 14. సుబ్బరాజు. డి, 15. సురేష్ కొండేటి, 16. తనీష్ 17. టార్జాన్

మంచు విష్ణు ప్యానెల్
అధ్యక్షుడు : మంచు విష్ణు
జనరల్ సెక్రటరీ: రఘుబాబు
ఉపాధ్యక్షులు : మాదల రవి, పృథ్వీరాజ్
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: బాబు మోహన్
ట్రెజరర్: శివ బాలాజీ
జాయింట్ సెక్రటరీలు: కరాటే కల్యాణి, గౌతమ్‌ రాజు

ఎగ్జిక్యూటివ్ మెంబర్స్
1. అర్చన, 2. అశోక్ కుమార్, 3.గీత సింగ్, 4.హరినాథ్ బాబు, 5.జయవాణి, 6.మలక్ పేట శైలజ మాణిక్, 7.పూజిత, 8.రాజేశ్వరి రెడ్డి, 9.రేఖ, 10.సంపూర్ణేష్ బాబు, 11.శశాంక్, 12.శివన్నారాయణ, 13.శ్రీ లక్ష్మి, 14.శ్రీనివాసులు.15.P, స్వప్న మాధురి, 16.విష్ణు బొప్పన, 17.వడ్లపట్ల

మా ప్రస్థానం..

993, అక్టోబరు 4వ తేదీన ‘మా’ ఏర్పాటయ్యింది. చిరు, మురళీమోహన్, అక్కినేని, కృష్ణ.. రెబల్ స్టార్ కృష్ణం రాజుల ఆలోచనతో మా జీవం పోసుకుంది. మా అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన నాటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మా తొలి అధ్యక్షులు చిరంజీవి, జనరల్ సెక్రటరీ మురళీమోహన్‌గా సేవలందించారు. ఇప్పటి వరకు 9 మంది అధ్యక్షులు, 9 మంది ప్రధాన కార్యదర్శులు పనిచేశారు. మా ప్రారంభంలో 150 మంది సభ్యులుండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 956కు చేరింది.

Also Read..

Danish PM Inida Tour: ప్రధాని మోడీ ప్రపంచానికే స్ఫూర్తిదాయకం.. భారత పర్యటనలో డానిష్ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సెన్

Hyderabad Rains: ఫస్ట్ షో చూసి బయటికొచ్చే సరికే… మరో సినిమా కనిపించింది.. పాపం