Maa Elections 2021: ప్రచారంలోనూ పోటా పోటీ.. ప్రకాష్ రాజ్ ట్వీట్‏కు బండ్ల గణేష్

|

Sep 30, 2021 | 9:04 AM

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల తేదీ దగ్గరపడుతుండడంతో అభ్యర్థులు వేగం పెంచారు. సోషల్ మీడియా వేదికగా ఓటర్లను

Maa Elections 2021: ప్రచారంలోనూ పోటా పోటీ.. ప్రకాష్ రాజ్ ట్వీట్‏కు బండ్ల గణేష్
Bandla Ganesh
Follow us on

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల తేదీ దగ్గరపడుతుండడంతో అభ్యర్థులు వేగం పెంచారు. సోషల్ మీడియా వేదికగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మాకు ఓటేయ్యండి అంటే మాకేయ్యండి అంటూ నెట్టింట్లో ప్రచారాలు చేసుకుంటున్నారు. అద్యక్ష పదవికి పోటీ పడుతున్న మంచు విష్ణు, ప్రకాష్ రాజ్.. ఇప్పటికే తమ ప్యానల్ సభ్యులను ప్రకటించారు. అలాగే మా బిల్డింగ్.. మనమంతా ఒక్కటే అనే అస్త్రాలతో ఓట్లు దక్కించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా మా ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. రోజు రోజుకీ రకారకాల ట్విస్ట్‏లు చోటు చేసుకుంటూ సాధారణంగా ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులకు సంబంధించిన పోస్టర్ షేర్ చేస్తూ.. ఆసక్తికర ట్వీట్ చేశారు.

#MaaElections2021 యూవర్ ఓట్ ఈజ్ యూవర్ వాయిస్.. మా హితమే… మా అభిమతం.. మనస్సాక్షిగా ఓటేద్దాం.. మా ఆశయాలను గెలిపిద్దాం అంటూ చేతులు జోడించిన ఎమోజీలను షేర్ చేశారు. ఇక ప్రకాష్ రాజ్ పోస్ట్‏కు రీట్వీట్ చేస్తూ.. బండ్లగణేష్ మరో ట్వీట్ చేశారు. ఓన్లీ వన్ ఓట్ ఫర్ బండ్ల గణేష్ ఫర్ జనరల్ సెక్రటరీ అంటూ చేతులు జోడించిన ఎమోజీని షేర్ చేశారు. దీంతో నెట్టింట్లో ప్రచార జోరు పోటా పోటీగా సాగుతుంది. ఇదిలా ఉంటే.. బండ్ల గణేష్ ముందుగా ప్రకాజ్ రాజ్ ప్యానల్లో ఉన్నాడు. అయితే అందులోకి జీవిత రాజశేఖర్ చేరడంతో ఆమె రాకను వ్యతిరేకిస్తూ.. ప్యానల్ నుంచి తప్పుకున్నాడు. అంతేకాకుండా.. ఆమెకు పోటీగా జనరల్ సెక్రటరీ పదవికి స్వతంత్రంగా పోటీ చేస్తున్నాడు. అక్టోబర్ 10న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజున సాయంత్రం ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నారు.

ట్వీట్స్..

Also Read: Mohan Babu: ఆరు నెలలు పనిచేయించుకుని 50 రూపాయాలు జీతం ఇచ్చారు.. మోహన్ బాబు ఆసక్తికర విషయాలు..

Maa Elections 2021: మా ఎన్నికల జోరు.. ఆసక్తికర ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్..