
Saranga Dariya: లవ్ స్టోరీ సినిమాలోని ‘‘సారంగ దరియా..’’ పాట యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టిన ఈ పాట సరికొత్త చరిత్రను సృష్టిస్తూ నెట్టింట్లో దూసుకపోతోంది. విడుదలైన నెల రోజుల్లోనే 10కోట్ల వ్యూస్‌తో రికార్డు నెలకొల్సిన సారంగ దరియా పాట.. అతి తక్కువ కాలంలోనే 25కోట్లకు పైగా వ్యూస్‌ను సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా 30 కోట్ల మార్కును దాటింది. దీంతో దక్షిణాదిలో మరే లిరికల్ వీడియో సాంగ్‌కు సాధ్యంకాని రికార్డును దక్కించుకుంది. ఈ పాట ముందుముందు మరెన్ని రికార్డులను కొల్లగొడుతుందో చూడాలి.
నాగచైతన్య, సాయిపల్లవి జోడీగా లవ్ స్టోరీ సినిమాలో నటించారు. ఈ సినిమాను శేఖర్ కమ్ముల తెరకెక్కించగా.. పవన్ సి.హెచ్ మ్యూజిక్ అందించారు. రచయిత సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ తెలంగాణ జానపదాన్ని.. సింగర్ మంగ్లీ పాడింది. ఈ పాటలో సాయి పల్లవి క్యూట్ లుక్స్‌తోపాటు స్టెప్పులతో అదరగొట్టింది. దీంతో ఈ పాటకు యూట్యూబ్‌లో రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. తెలంగాణ నేపథ్యంలో సాగే ఓ విభిన్నమైన ప్రేమ కథతో లవ్ స్టోరీ సినిమా రూపొందింది. ఈ ఏడాది మే నెలల విడుదల కావాల్సిన సినిమా కరోనా పరిస్థితులతో వాయిదా పడింది. ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ కావడంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకుకొచ్చేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
Rahul Ramakrishna: అమ్మాయితో కలిసి వైన్ తాగుతూ… హల్‌చల్ చేసిన టాలీవుడ్ కమెడియన్..
Rashmika Mandanna -Rashi Khanna: ఇద్దరూ ఇద్దరే.. కుర్రాళ్ళ గుండెలకు గాలాలు వేస్తున్న వయ్యారాలు..