
తెరపై ఆయన కనిపించగానే జనం జడుసుకునేవారు. సినిమాల్లో ఆయన పాత్ర అంత పవర్‌ఫుల్‌గా ఉండేది. ఆయన మరెవరో కాదు.. నటుడు రాజనాల. ఒకప్పుడు తెలుగు సినిమా ప్రపంచంలో ప్రతినాయకుడి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేశాడు. హీరో పాత్రకు ఎంతగా ప్రాధాన్యత ఉంటుందో.. అదే స్థాయిలో విలన్ పాత్ర సైతం ప్రధానం. 1950వ దశకంలో విలన్ పాత్రకు ఆయన వన్నె తెచ్చారు. ఇండస్ట్రీలో రాకముందు తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు ఉన్నప్పటికీ, వాటికి ఒక నిర్దిష్టమైన ముద్ర అంటూ లేదు. రాజనాల రంగప్రవేశంతో విలనీకి సరికొత్త గంభీరత్వం, రాచఠీవి వచ్చాయి. ఒకానొక దశలో రాజనాల పారితోషికం హీరోలకు సమానంగా ఉండేదంటే ఆయనకున్న స్టార్‌డమ్ ఎంతటిదో తెలుస్తుంది. మద్రాసులో ఐదు విశాలమైన భవంతులు, ఎల్లప్పుడూ తిరిగే ఐదు కార్లు ఆయన వైభవానికి నిదర్శనం. విలన్ అంటే ఇలా ఉండాలని చూపించి, తన నటనతో తెలుగు సినిమాకు మరపురాని వారసత్వాన్ని అందించిన రాజనాల ఎప్పటికీ స్మరణీయులే.
ఎక్కువ మంది చదివినవి : Naga Chaitanya : అప్పుడు నాగార్జున జోడిగా.. ఇప్పుడు నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్.. ఎవరంటే..
రాజనాల అసలు పేరు రాజనాల కాళేశ్వరరావు నాయుడు. జనవరి 3, 1925న నెల్లూరులో జన్మించిన ఆయన, వెండితెరపై కరడుగట్టిన విలన్‌గా మెప్పించినప్పటికీ.. నిజ జీవితంలో మాత్రం ఎంతో విద్యావంతుడు, దయా హృదయుడు కావడం విశేషం. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన దగ్గరకు వెళ్లేందుకు జనం భయపడేవారు. ముఖ్యంగా మహిళలు ఆయనను చూసి భయపడేవారు. తన సినీ ప్రయాణంలో దాదాపు 100కి పైగా సినిమాల్లో నటించారు రాజనాల. ఎన్టీఆర్, ఎం.జి.ఆర్, జయలలిత.. ఇలా ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఘనత దక్కించుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : పెళ్లి ఫంక్షన్లలో పని.. రూ.500 జీతం కోసం ఎన్నో కష్టాలు.. కట్‌చేస్తే టాలీవుడ్ క్వీన్..
సినిమాల్లో విలనిజంతో మెప్పించిన రాజనాల.. 1970వ దశకం సినిమా సైలెంట్ అయ్యారు. కొత్త విలన్స్ రావడంతో ఆయనకు అవకాశాలు తగ్గిపోయాయి. అలాగే అడిగినవారికి సాయం చేస్తూ దానధర్మాలు చేయడంతో ఆస్తి కరిగిపోయింది. ఆయన పరిస్థితి తెలిసి ఎన్టీఆర్ తన సినిమాల్లో అవకాశాలు ఇచ్చి ఆదుకున్నారు. చివరి రోజుల్లో ఈవీవీ సత్యనారాయణ హాలో బ్రదర్ చిత్రంలో.. ఎస్వీ కృష్ణారెడ్డి నెంబర్ వన్ సినిమాలో కనిపించారు. కృష్ట నటించిన తెలుగువీర లేవరా సినిమా షూటింగ్ అరకులో జరుగుతున్న సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. మధుమేహం పెరగడం.. కుడికాలుకు ఇన్ఫెక్షన్ రావడంతో కాలు తొలగించారు. దీంతో పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. 1998లో మే 21న గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. అప్పుడు ఆయన వయసు 73 సంవత్సరాలు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఏం పాట రా బాబు.. అప్పట్లో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.. ఇప్పటికీ ట్రెండింగ్ ఈ సాంగ్..
ఎక్కువ మంది చదివినవి : దాసరి, చిరంజీవి చేతుల మీదుగా అవార్డ్ అందుకుంటున్న నటుడిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు జబర్దస్త్ షోలో ఫేమస్ కమెడియన్..