Project K : రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) క్రేజ్ గురించి ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డార్లింగ్ సినిమా అంటే మినిమమ్ ఉంటుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీసే .. ఇటీవలే రాధేశ్యామ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. ఈ మూవీ డివైడ్ టాక్ ను సొంతం చేకున్నప్పటికీ భారీ వసూళ్లను రాబట్టి ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయం అందుకున్న ప్రశాంత్ నీల్ మరోసారి ప్రభాస్ తో కలిసి యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్. ఇక ఈ మూవీతోపాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్. అలాగే మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కే చేస్తున్నాడు డార్లింగ్.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇప్పుడు ప్రాజెక్ట్ కే గురించి సరికొత్త పుకారు ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు చేస్తుంది. ప్రాజెక్ట్ కే సినిమా లో ప్రభాస్ తో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో అమితాబ్ గురూజీ లేదా బాబా పాత్రలో కనిపించనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అశ్వద్ధామ పాత్రలో కనిపించబోతున్నట్లుగా పుకారు వినిపిస్తుంది. అశ్వద్ధామ మహాభారతంలోని పాత్ర కావడంతో మహా భారతంతో ప్రాజెక్ట్ కే కు లింక్ పెట్టి సినిమాను తీస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఆదిపురుష్ ను రామాయణ ఇతివృత్తంతో చేస్తున్న ప్రభాస్ ప్రాజెక్ట్ కే ను మాత్రం మహా భారతంతో చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :