Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’లో మహేష్‌ను ఢీ కొట్టబోయేది అర్జున్‌ కాదటా.. మరెవరో తెలుసా.?

Sarkaru Vaari Paata: టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేష్ బాబు చిత్రం కోసం ఆయన అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. 'సర్కారు వారి పాట' విడుదలై దాదాపు రెండేళ్లు గడుస్తోన్న తరుణంలో అందరి దృష్టి మహేష్‌ సినిమాపై పడింది. దీనికి తగ్గట్లుగానే..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటలో మహేష్‌ను ఢీ కొట్టబోయేది అర్జున్‌ కాదటా.. మరెవరో తెలుసా.?
Sarkaru Vari Pata

Edited By: Rajitha Chanti

Updated on: Jul 10, 2021 | 12:19 PM

Sarkaru Vaari Paata: టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేష్ బాబు చిత్రం కోసం ఆయన అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదలై దాదాపు రెండేళ్లు గడుస్తోన్న తరుణంలో అందరి దృష్టి మహేష్‌ సినిమాపై పడింది. దీనికి తగ్గట్లుగానే ప్రిన్స్‌ తన తదుపరి చిత్రం ‘సర్కారు వారి పాట’ను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. బ్యాంకింగ్‌ రంగంలో జరిగే ఆర్థిక కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కావంతో ఈ చిత్రంపై తొలి నుంచే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ఇపాటికే ప్రేక్షకుల ముందకు రావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్‌ ఎవరనే విషయంపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. మొదట ఈ చిత్రంలో సీనియర్‌ నటుడు అర్జున్‌ నెగిటివ్‌ రోల్‌లో నటించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే తర్వాత దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇక తాజాగా తెరపైకి మరో నటుడు పేరు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం సర్కారు వారి పాటలో సముద్ర ఖని విలన్‌గా నటించనున్నాడనేది సదరు వార్త సారాంశం. సముద్ర ఖని ఇప్పటికే బన్నీ హీరోగా తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’, రవితేజ లీడ్‌ రోల్‌లో వచ్చిన ‘క్రాక్‌’ సినిమాలో విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో సముద్రఖని తనదైన నటనతో ఆకట్టుకున్నారు. దీంతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయిన సముద్ర ఖనిని తీసుకోవాలని చిత్ర యూనిట్‌ భావిస్తున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మైత్రీ మూవీస్‌, 14 రీల్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో మహేష్‌కు జోడిగా కీర్తి సురేశ్‌ నటిస్తోన్న విషయం తెలిసిందే.

Samudra Khani

Also Read: Viral Video: బావతో మరదలి సరదా.. బాలీవుడ్ పాటకు ఓ రేంజ్‌లో స్టెప్పులు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..

Shocking Video: రోడ్డంతా నాదే.. మందుబాబు డేంజర్ డ్రైవింగ్ విన్యాసాలు చూస్తే షాకే..

Mahasamudram : షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేసిన మహాసముద్రం టీమ్.. ఆకట్టుకుంటున్న పోస్టర్