
కొత్త కొత్త సినిమాలు అటు థియేటర్స్ లోనూ ఇటు ఓటీటీల్లోనూ సందడి చేస్తున్నాయి. థియేటర్స్ లోవిడుదలైన నెలరోజులకు ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను డబుల్ ఎంటర్టైన్ చేస్తున్నాయి నయా మూవీ. ఇక ఇప్పుడు ఓ సరికొత్త యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఆ సినిమా మరేదో కాదు లేటెస్ట్ సూపర్ హిట్ దీవానా. ప్రేమకథల్లో కొత్తదనం, మంచి ఫీల్ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అందుకే దర్శకులు తరచూ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. సరిగ్గా ఇలాంటి ఓ స్వచ్ఛమైన ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా దీవాన. హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఈ సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చింది.
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ అందమైన ప్రేమకథ చిత్రం దీవానా ప్రేక్షకులను ఆకట్టుకుంది. జూన్ 19న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమాలోని పాటలు కూడా ఆడియన్స్ ను మెప్పించాయి. చాలా మంది యూత్ ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు. దీవానా థియేటర్స్ లో హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాను ఓటీటీలో చూడటానికి ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.
ఆహా గోల్డ్ యూజర్స్ ఈ సినిమాను ఒక్క రోజు ముందుగానే అంటే నిన్ననే ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేశారు. ఇక ఇప్పుడు నార్మల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది దీవానా.. ఈ రోజు (31 నుంచి) అందుబాటులోకి వచ్చేసింది. మారేందుకు ఆలస్యం ఈ సినిమాను ఆహాలో ఫ్యామిలీతో పాటు చేసి ఎంజాయ్ చేయండి. ఇక ఈ సినిమాలో బాధ్యత లేని యువకుడిగా, ఆ తర్వాత ఎమోషనల్ సీన్స్‌లో హర్షిత్ రెడ్డి తన నటనతో ఆకట్టుకుంటాడు. రెండు షేడ్స్ లో తన నటనతో ఆకట్టుకున్నాడు. అమూల్య పాత్రలో స్మేహా మణిమేఘలై అందంతో పాటు అద్భుతమైన నటనతో మెప్పించింది. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.