AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kashi Majili Song: ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రేణూ దేశాయ్ ‘కాశీ మజిలీ’.. గుండెను తాకే ఈ పాట విన్నారా?

ఇటీవలే ఓటీటీ వేదికగా విడుదలైన ‘కాశీ మజిలీ’ అనే చిత్రం ఇప్పుడు టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఇందులో అత్యంత ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే.. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు డి. యమునా కిశోర్ గారే స్వయంగా ఈ పంక్తులను రాసి, పాడటమే కాకుండా, ఓ ప్రత్యేక కేమియో వేషంలో కనిపించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు

Kashi Majili Song: ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రేణూ దేశాయ్ 'కాశీ మజిలీ'.. గుండెను తాకే ఈ పాట విన్నారా?
Renu Desai Kashi Majili
Basha Shek
|

Updated on: Oct 02, 2026 | 3:26 PM

Share

సాధారణంగా కాశీ వెళ్లొచ్చిన వాళ్లు.. “కాశీలో అది వదిలిపెట్టాం, ఇది వదిలిపెట్టాం” అని చెబుతుంటారు. కానీ దర్శకుడు యమునా కిశోర్ గారు కాశీని చూసిన కోణం చాలా లోతైనది. “కాశీ మన నుంచి ఏమీ తీసుకోదు.. మన గుండెల్లో ఉన్న బాధను మాత్రమే తీసుకుంటుంది, తిరిగి మనకు స్వచ్ఛమైన సంతోషాన్ని ఇస్తుంది” అనే ఒక అద్భుతమైన తాత్విక థీమ్‌తో ఆయన కాశీ మజిలీ సినిమాను మలిచారు. మనిషి అంతరంగాన్ని ఆవిష్కరించే ఈ గొప్ప ఆలోచనే నేడు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. తన ‘డ్రీమ్ మర్చంట్స్’ సంస్థ ద్వారా ఇప్పటివరకు 600కు పైగా అడ్వర్టైజ్‌మెంట్‌లను (యాడ్ ఫిల్మ్స్) రూపొందించిన అపారమైన అనుభవం దర్శకుడు డి. యమునా కిశోర్ గారి సొంతం. నిరంతరం గ్లామర్, హంగులతో కలర్‌ఫుల్‌గా ఉండే ఆ యాడ్ ప్రపంచం నుంచి కాసేపు బయటికి వచ్చి.. పూర్తిగా ఆధ్యాత్మిక వాసనలు గుబాళించేలా, మనసుకు హత్తుకునేలా ఈ సినిమా తీయడం ఆయనలోని అసలైన సృజనాత్మకతకు, వైవిధ్యానికి నిదర్శనం.

రేణు దేశాయ్, శంకర్ ఇందుచూడన్ ప్రధాన పాత్రల్లో సహజమైన నటనతో ఆకట్టుకున్న ఈ సినిమా కోసం, దివంగత మహాకవి శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన ఒక అపురూపమైన పాటను ఉపయోగించారు. కథలోని ఆత్మను ప్రేక్షకుడి గుండెల్లోకి చేర్చడానికి సిరివెన్నెల గారి సాహిత్యాన్ని ఎంచుకోవడం, దానికి డా. జోశ్యభట్ల గారి సంగీతాన్ని జోడించడం యమునా కిశోర్ గారి ఉన్నతమైన సాహితీ, సంగీత అభిరుచికి అద్దం పడుతోంది. అద్భుతమైన కాశీ అందాలు, వాటిని తెరపై ఆవిష్కరించిన యమునా కిశోర్ గారి టేకింగ్, విభిన్నమైన ఒక ప్రేమ కథకు కాశీ ఆధ్యాత్మికతను జోడించిన తీరు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ప్రతి ఫ్రేములోనూ కనిపించే యమునా కిశోర్ గారి తాలూకు విజువల్ ఆస్థటిక్స్ (Aesthetics), ఫ్రేము ఫ్రేములోనూ తొణికిసలాడే ఆధ్యాత్మికత ఈ చిత్రాన్ని ఒక దృశ్యకావ్యంలా నిలబెట్టాయి. కళ్ళూరి జగదీష్ కుమార్ నిర్మాణంలో, రాణా ఛాయాగ్రహణం, మీర్ కూర్పు తోడవ్వగా.. దర్శకుడు డి. యమునా కిశోర్ గారి బహుముఖ ప్రజ్ఞకు, ఆయన క్రియేటివ్ విజన్‌కు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఈ ‘కాశీ మజిలీ’ ఇప్పుడు విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తోంది.

కాశీ మజిలీ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కండక్టర్‌తో పని లేకుండా యాప్‌లోనే టికెట్ పొందొచ్చు.. ఎలా అంటే..?
కండక్టర్‌తో పని లేకుండా యాప్‌లోనే టికెట్ పొందొచ్చు.. ఎలా అంటే..?
ఓటీటీలో రేణూ దేశాయ్ 'కాశీ మజిలీ'.. గుండెను తాకే ఈ పాట విన్నారా?
ఓటీటీలో రేణూ దేశాయ్ 'కాశీ మజిలీ'.. గుండెను తాకే ఈ పాట విన్నారా?
గ్రూప్ దశ తర్వాతే అసలు ఆట.. వరల్డ్‌కప్‌లో ‘సూపర్-7’ స్టేజ్ ఏంటంటే
గ్రూప్ దశ తర్వాతే అసలు ఆట.. వరల్డ్‌కప్‌లో ‘సూపర్-7’ స్టేజ్ ఏంటంటే
ఆసియా గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకాల పంట.. ఒక్కరోజే 4
ఆసియా గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకాల పంట.. ఒక్కరోజే 4
హైదరాబాద్‌లో పాకిస్తాన్‌ కాస్మెటిక్స్‌ కలకలం..!
హైదరాబాద్‌లో పాకిస్తాన్‌ కాస్మెటిక్స్‌ కలకలం..!
ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. వాతావరణశాఖ హెచ్చరిక
ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. వాతావరణశాఖ హెచ్చరిక
రెండో గోల్డ్ మెడల్ కొట్టేందుకు సిద్ధమవుతున్న ఐదుగురు స్టార్స్
రెండో గోల్డ్ మెడల్ కొట్టేందుకు సిద్ధమవుతున్న ఐదుగురు స్టార్స్
రైల్వేలో భారీఉద్యోగ నోటిఫికేషన్‌.. టెన్త్ మార్కులతో నేరుగా జాబ్స్
రైల్వేలో భారీఉద్యోగ నోటిఫికేషన్‌.. టెన్త్ మార్కులతో నేరుగా జాబ్స్
SSC కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల షెడ్యూల్ 2026 వచ్చేసిందోచ్..
SSC కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల షెడ్యూల్ 2026 వచ్చేసిందోచ్..
10th క్లాస్ మూడుసార్లు ఫెయిల్ అయ్యా..
10th క్లాస్ మూడుసార్లు ఫెయిల్ అయ్యా..