Puneeth Rajkumar: హీరో దర్శన్ పై దాడి.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్..

కన్నడ హీరో దర్శన్ తన రాబోయే సినిమా 'క్రాంతి' ని ప్రమోట్ చేస్తున్న సమయంలో కర్ణాటకలోని హూసపేటలో ఓ వ్యక్తి దర్శన్ పైకి చెప్పువిసిరాడు. ఆకస్మాత్తుగా జరిగిన ఆ ఘటనతో అక్కడున్నవారంత షాకయ్యారు.

Puneeth Rajkumar: హీరో దర్శన్ పై దాడి.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్..
Shiva Rajkumar, Darshan

Updated on: Dec 21, 2022 | 4:15 PM

కన్నడ హీరో దర్శన్ పై జరిగిన దాడిపై దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ సోదరుడు నటుడు శివరాజ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శన్ పై జరిగిన తన దాడి తనను కలచి వేసిందని..తామంతా ఒక కుటుంబసభ్యులమేనని అన్నారు. ” నిన్న హోస్పేట్‌లో దర్శన్‌పై జరిగిన దాడి నా హృదయాన్ని బాధించింది. మేమంతా ఒకటే కుటుంబానికి చెందినవాళ్లం. ఇలాంటి అమానవీయ ఘటన మా కుటుంబానికి చెందిన వారందరినీ బాధిస్తాయి. దయచేసి ఎవరూ మానవత్వాన్ని మరచి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని మనవి చేస్తున్నాను. అభిమానంతో ప్రేమను పంచండి. ద్వేషం, అగౌరవం కాదు” అంటూ ట్వి్ట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు శివరాజ్ కుమార్.

కన్నడ హీరో దర్శన్ తన రాబోయే సినిమా ‘క్రాంతి’ ని ప్రమోట్ చేస్తున్న సమయంలో కర్ణాటకలోని హూసపేటలో ఓ వ్యక్తి దర్శన్ పైకి చెప్పువిసిరాడు. ఆకస్మాత్తుగా జరిగిన ఆ ఘటనతో అక్కడున్నవారంత షాకయ్యారు. వెంటనే సదరు వ్యక్తిని పోలీసులు చుట్టుముట్టగా.. ఆవ్యక్తిని ఏమి చేయవద్దని చెప్పారు దర్శన్. ఈ ఘటనకు ముందు ఈవెంట్ జరిగే చోట పునీత్, దర్శన్ అభిమానుల మధ్య వివాదం చోటు చేసుకుంది. గతంలో పునీత్ గురించి దర్శన్ చేసిన వ్యాఖ్యలే ఈ దాడికి కారణమని ప్రచారం జరుగుంది.

ఇక దర్శన్ పై జరిగిన దాడిపై పుష్ప నటుడు ధనుంజయ స్పందించారు. దర్శన్ పై జరిగిన ఈ చర్య సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరిని దిగ్ర్భాంతికి గురి చేసిందని.. కొంతమంది వ్యక్తులు చేసే పని వల్ల ఒకరినొకరు ప్రేమించుకునే, గౌరవించే కళాకారుల ఛరిష్మా దెబ్బతినకూడదు. ఇలాంటి ఘటనకు పాల్పడిన వ్యక్తులకు శిక్షపాలి. అభిమానుల మధ్య ఇలాంటి విభేదాలు ఉండకూడదు. మన రాష్ట్రం, ప్రేమ, కరణకు పుట్టినిల్లు అని అన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.