Padmaja Raju: టాలీవుడ్‌లో మరో విషాదం.. అలనాటి అందాల హీరో హరనాథ్‌ కూతురు హఠాన్మరణం

|

Dec 20, 2022 | 5:53 PM

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన గోకులంలో సీత, తొలిప్రేమ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను పద్మజా రాజు భర్త జీవీజీ రాజు నిర్మించారు. అలాగే అక్కినేని సుమంత్‌- శేఖర్‌ కమ్ముల కాంబినేషన్‌లో వచ్చిన గోదావారి సినిమా కూడా ఈ ప్రొడక్షన్ బ్యానర్‌ నుంచి వచ్చిందే.

Padmaja Raju: టాలీవుడ్‌లో మరో విషాదం.. అలనాటి అందాల హీరో హరనాథ్‌ కూతురు హఠాన్మరణం
Haranath Daughter
Follow us on

సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా ప్రముఖ నిర్మాత జీవీజీ రాజు భార్య పద్మజా రాజా మంగళవారం (డిసెంబర్‌20) మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. నాటి తరం అందాల హీరో హరనాథ్‌ కూతురే పద్మజా రాజు. ఆమె వయసు 54 సంవత్సరాలు. ఇద్దరు కుమారులు ఉన్నారు. పద్మజా రాజు సోదరుడు శ్రీనివాసరాజు కూడా నిర్మాతనే. పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన గోకులంలో సీత, తొలిప్రేమ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను పద్మజా రాజు భర్త జీవీజీ రాజు నిర్మించారు. అలాగే అక్కినేని సుమంత్‌- శేఖర్‌ కమ్ముల కాంబినేషన్‌లో వచ్చిన గోదావారి సినిమా కూడా ఈ ప్రొడక్షన్ బ్యానర్‌ నుంచి వచ్చిందే. కాగా ఇటీవల పద్మజారాజు తన తండ్రి హరనాథ్ జీవిత విశేషాలతో ‘అందాలనటుడు’ పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. దివంగత సూపర్‌స్టార్‌ కృష్ణ చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఇటీవల పద్మజా రాజు మాట్లాడుతూ.. త్వరలోనే తన కుమారుల్లో ఒకరు నిర్మాతగా పరిచయం చేస్తున్నానని తెలిపారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని, వచ్చే ఏడాదికల్లా తన ఇంటి నుంచి మరో నిర్మాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడతాడని పద్మజా రాజు చెప్పుకొచ్చారు. అయితే ఇంతలోనే ఆమె కన్నుమూయడం విషాదకరం. పద్మజా మృతితో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నారు. బుధవారం (డిసెంబర్‌21) ఉదయం మహా ప్రస్థానంలో హరనాథ్‌ కూతురు అంత్యక్రియలు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..