Tollywood: తీవ్రంగా గాయపడిన స్టార్‌ మహిళా డైరెక్టర్‌.. ఎంతో బాధగా ఉందంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌

|

Feb 05, 2023 | 4:07 PM

ప్రస్తుతం సుధ ఆకాశం హద్దురా హిందీ రీమేక్‌ను తెరకెక్కిస్తున్నారు.  ఇందులో అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తుండగా, రాధిక మదన్‌ అక్షయ్‌ సరసన స్ర్కీన్ షేర్‌ చేసుకోనుంది. ఈ సినిమా షూటింగ్‌లోనే సుధకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Tollywood: తీవ్రంగా గాయపడిన స్టార్‌ మహిళా డైరెక్టర్‌.. ఎంతో బాధగా ఉందంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌
Lady Director
Follow us on

ఇటీవల సినిమా షూటింగ్‌లు ప్రమాదాలకు నెలవుగా మారుతున్నాయి. అనుకోకుండా జరిగిన సంఘటనలతో సినిమా తారలు గాయాల పాలవుతున్నారు. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటి సన్నీలియోన్‌ కాలికి సినిమా సెట్‌లో తీవ్రగాయమైన సంగతి తెలిసిందే. అదేవిధంగా మేకప్‌ రూంలో పేలుడు సంభవించడంతో బంగ్లాదేశ్‌కు ఓ వర్ధమాన నటి తీవ్ర అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. తాజాగా స్టార్‌ లేడీ డైరెక్టర్‌ సుధా కొంగర కూడా ఈ జాబితాలో చేరారు. గురు, ఆకాశమే హద్దురా లాంటి సూపర్‌ హిట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె తాజాగా సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ షేర్‌ చేశారు. అందులో చేతికి కట్టుతో కనిపించారామె. ‘ఎంతో బాధగా ఉంది. చిరాకు పెట్టేస్తోంది. నెలరోజుల పాటు ఈ రెస్ట్ తప్పదు’ అంటూ ఈ ఫొటోలకు క్యాప్షన్‌ ఇచ్చారు సుధ. అయితే ఈ ప్రమాదం ఎప్పుడు ఎలా జరిగింది అనే విషయాల్ని మాత్రం ఇందులో వెల్లడించలేదు. బహుశా సినిమా షూటింగ్ లోనే ఈ యాక్సిడెంట్‌ జరిగి ఉండొచ్చనిపిస్తోంది. ప్రస్తుతం సుధ ఆకాశం హద్దురా హిందీ రీమేక్‌ను తెరకెక్కిస్తున్నారు.  ఇందులో అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తుండగా, రాధిక మదన్‌ అక్షయ్‌ సరసన స్ర్కీన్ షేర్‌ చేసుకోనుంది. ఈ సినిమా షూటింగ్‌లోనే సుధకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

కాగా సుధా కొంగర ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. సంగీత దర్శకుడు జీ.వి ప్రకాష్‌ కుమార్‌ ‘త్వరలోనే కోలుకుంటారు సిస్టర్’ అంటూ కామెంట్‌ చేశాడు. కాగా విజయవాడలో పుట్టిన సుధా కొంగర మొదట దిగ్గజ దర్శకుడు మణిరత్నం దగ్గర దర్శకురాలిగా పనిచేసింది. ఆ తర్వాత మాధవన్‌ హీరోగా ‘సాలా ఖాదుస్’ సినిమాతో డైరెక్టర్ గా మారి సూపర్‌ హిట్ కొట్టింది. ఇదే సినిమాను తెలుగులో గురు పేరుతో వెంకటేశ్ హీరోగా రీమేక్ చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక సూర్య హీరోగా తీసిన ‘ఆకాశమే హద్దురా’ సినిమా అయితే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. జాతీయ అవార్డులు కూడా వచ్చాయి.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..