ధనుష్ హీరోగా నటిస్తున్న సినిమా కుబేర. అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ధనుష్ లుక్‌కి మంచి స్పందన వస్తోంది. చెదిరిన జుట్టు, మాసిన గడ్డంతో నవ్వుతూ కనిపిస్తున్నారు ధనుష్. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. సోషల్ డ్రామా నేపథ్యంలో ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది.