Nupur Sanon: మొన్న క్రిస్టియన్ పద్ధతిలో.. నిన్న హిందూ పద్ధతిలో.. మళ్లీ పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్

ప్రముఖ హీరోయిన్ నుపుర్ సనన్ ఇటీవలే పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ సింగర్ స్టెబిన్ బెన్ ని ప్రేమించి వివాహం చేసుకుందీ అందాల తార. మొదట క్రిస్టియన్ పద్దతిలో పెళ్లి చేసుకోగా తాజాగా హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Nupur Sanon: మొన్న క్రిస్టియన్ పద్ధతిలో.. నిన్న హిందూ పద్ధతిలో.. మళ్లీ పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్
Nupur Sanon Marriage

Updated on: Jan 13, 2026 | 6:22 PM

బాలీవుడ్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ ఇటీవల పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ప్రముఖ సింగర్ స్టెబిన్ బెన్ ను ఆమె ప్రేమించి వివాహం చేసుకుంది. మొదట క్రిస్టియన్ పద్దతిలో వీరు పెళ్లి చేసుకోగా తాజాగా హిందూ సంప్రదాయంలో ఏడడుగులు నడిచారు. ఉదయ్‌పూర్‌ వేదికగా జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. కృతి సనన్ బాయ్ ఫ్రెండ్ కబీర్ బహియాతో పాటు బాలీవుడ్ హీరోయిన్లు దిశా పటాని, మౌనీ రాయ్ సన్నిహితులు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. నుపుర్ సనన్ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా నుపుర్ సనన్ గ్రాండ్ వెడ్డింగ్‌లో ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్ అన్నీ తానై దగ్గరుండి నడిపించింది. పెళ్లికి సంబంధించిన అన్నీ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంది. ఇక సంగీత్ లాంటి ఈవెంట్లలో అయితే డ్యాన్స్ లు కూడా చేసి ఆహూతులను అలరించింది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట బాగా చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

చెల్లి పెళ్లిలో కృతి సనన్ డ్యాన్స్.. వీడియో..

ఇక నుపుర్‌ సనన్‌ విషయానికి వస్తే.. మాస్ మహారాజ రవితే నటించిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’ అనే తెలుగు మూవీతో హీరోయిన్‌గా పరిచయమైందీ.ఆ తర్వాత మంచు విష్ణు కన్నప్ప సినిమాలోనూ హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. కానీ ఎందుకో కానీ మధ్యలోనే తప్పుకుంది. ఆపై ఒకటీరెండు ఆల్బమ్‌ సాంగ్స్‌లో కనిపించింది. ప్రస్తుతం ‘నూరని చెహ్రా’ అనే హిందీ సినిమా చేస్తోంది నుపుర్ సనన్. బాలీవుడ్‌లో ఇదే తన తొలి సినిమా కావడం విశేషం.

నుపుర్ సనన్ పెళ్లి ఫొటోస్..

నూతన వధూ వరుల డ్యాన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.