Trisha: త్రిష అందంపై షాకింగ్ కామెంట్స్ చేసిన యంగ్ హీరోయిన్..  

తెలుగులోనే కాకుండా.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది. దాదాపు 20 ఏళ్లుగా హీరోయిన్‏గా రాణిస్తోంది. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించిన త్రిష కెరీర్ మధ్యలో కాస్త డల్ అయ్యింది. ప్రేమ, నిశ్చితార్థంతోపాటు.. ఇతర వ్యక్తిగత కారణాలతో సినిమాలను తగ్గించేసింది.

Trisha: త్రిష అందంపై షాకింగ్ కామెంట్స్ చేసిన యంగ్ హీరోయిన్..  
Trisha

Edited By:

Updated on: May 18, 2023 | 6:48 PM

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లలో త్రిష ఒకరు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన వర్షం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించి స్టార్ డమ్ అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి.. నాగార్జున, ఎన్టీఆర్ వంటి స్టార్స్ సరసన నటించి మెప్పించింది. తెలుగులోనే కాకుండా.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది. దాదాపు 20 ఏళ్లుగా హీరోయిన్‏గా రాణిస్తోంది. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించిన త్రిష కెరీర్ మధ్యలో కాస్త డల్ అయ్యింది. ప్రేమ, నిశ్చితార్థంతోపాటు.. ఇతర వ్యక్తిగత కారణాలతో సినిమాలను తగ్గించేసింది. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. ఈ క్రమంలో ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ చిత్రంలో యువరాణి కుందవై పాత్రలో నటించింది. ఈ సినిమా త్రిషకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిందనే చెప్పుకొవాలి.

ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్లలో త్రిష అందానికి సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం ఫిదా అయ్యారు. నాలుగు పదుల వయసులోనూ ఇరవైఏళ్ల అమ్మాయిగా కనిపిస్తూ అభిమానులను మంత్రముగ్దులను చేసింది. ఇక త్రిష అందానికి తాను కూడా ఫ్యాన్ అయ్యానంటుంది హీరోయిన్ కృతి శెట్టి. ఇటీవల ఆమె నటించిన కస్టడీ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి.. తన ఫేవరేట్ హీరోయిన్ త్రిష అని చెప్పింది.

ఇవి కూడా చదవండి

‘‘నాకు త్రిష అంటే చాలా ఇష్టం. ఆమె ముఖంలో గ్లో ఏమీ తగ్గలేదు. ఆమె ఇప్పటికీ నాకంటే అందంగా కనిపిస్తున్నారు. అని నేను అనుకుంటున్నాను’’ అని అన్నారు కృతి. ప్రస్తుతం నాగచైతన్య, కృతి జంటగా నటించిన కస్టడీ సినిమా థియేటర్లలో రన్ అవుతుంది. డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇందులో కానిస్టేబుల్ శివ పాత్రలో నటించారు చైతూ. అలాగే ఇందులో అరవింద స్వామి, శరత్‌ కుమార్‌, ప్రియమణి, సంపత్‌ రాజ్‌ తదితరులు లీడ్‌ రోల్స్‌లో నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.