మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది కృతి శెట్టి (Krithi Shetty). ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్థానం ఏర్పర్చుకుంది. ఇప్పటివరకు కృతి శెట్టి చేసిన సినిమాలన్ని సూపర్ హిట్ కావడంమే విశేషం. ప్రస్తుతం ఈ అమ్మడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని సరసన ది వారియర్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ మూవీని జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు మేకర్స్.
తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్య్వూలో పాల్గోన్న కృతి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. కృతి శెట్టి మాట్లాడుతూ.. ” నా మాతృభాష తుళు.. తెలుగు బాగానే మాట్లాడతాను. ఇంతవరకు తెలుగు బాగా తెలిసిన దర్శకులతోనే కలిసి పనిచేశాను. లింగుసామిగారి తెలుగులో తమిళ యాస కూడా ఉంటుంది. నాకు తమిళం తెలియదు. అందువలన ఆయన మాట్లాడే తెలుగు అర్థం అయ్యేది కాదు. అలా ఒక వారం రోజులపాటు చాలా ఇబ్బందిపడ్డాను. రామ్ గారికి తమిళం కూడా వచ్చు. దీంతో ఆయన సపోర్ట్ తీసుకున్నాను. డైరెక్టర్ ఏం చెబుతున్నారనేది నాకు రామ్ గారు చెప్పేవారు. ఆ తర్వాత నేను అలవాటు పడిపోయాను. ఈ సినిమాలో రేడియో జాకీగా కనిపిస్తాను. నా పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ది వారియర్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.