
ఎంతో మంది హీరోయిన్స్ చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కెరీర్ స్టార్ట్ చేసి తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో ఎంతో మంది నటీనటులు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించి అలరించారు. అప్పుడు వరుస చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు హీరోహీరోయిన్లుగా వెండితెరపై సత్తా చాటుతున్నారు. ఇప్పటికే తెలుగులో తేజా సజ్జా.. హీరోగా మారి ఆతర్వాత హనుమాన్ సినిమాతో స్టార్ డమ్ అందుకున్నాడు. అటు సంతోష్ శోభన్, సంగీత్ శోభన్, శ్రీవిధ్య, కావ్య కళ్యాణ్ రామ్, అనిక సురేంద్రన్, ఎస్తేర్ అనిల్.. ఇలా చాలా మంది చిన్నప్పుడు తమ నటనతో ఆకట్టుకుని.. ఇప్పుడు వెండితెరపై మెయిన్ లీడ్స్ పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ హీరో, హీరోయిన్స్ అందరూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే ఓ చిన్నది ఓ స్టార్ హీరో సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ఇప్పుడు అదే హీరో సరసన హీరోయిన్ గా నటిస్తుందని వార్తలుచక్కర్లు కొడుతున్నాయి. దాని పై ఆమె క్లారిటీ కూడా ఇచ్చింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
ఓ హీరో సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి అదే హీరో సరసన ఇప్పుడు హీరోయిన్ గా ఎవరో కాదు.. కృతి శెట్టి. ఈ చిన్నది తెలుగు, తమిళ సినిమాల్లో పని చేస్తూ బిజీగా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ 2003 సెప్టెంబరు 21న కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది, ముంబైలో పెరిగింది. ఆమె తండ్రి కృష్ణ శెట్టి వ్యాపారవేత్త, తల్లి నీతి శెట్టి ఫ్యాషన్ డిజైనర్. చిన్నతనం కృతి శెట్టి ఐడియా, షాపర్స్ స్టాప్, పార్లే, లైఫ్‌బాయ్ వంటి పలు బ్రాండ్‌ల వాణిజ్య ప్రకటనల్లో నటించింది. ఇక ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ ను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. కృతి 2019లో హిందీ చిత్రం సూపర్ 30లో చిన్న పాత్రతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అంతకు ముందు కార్తీ హీరోగా నటించిన నా పేరు శివ సినిమాలో ఇలా కనిపించి అలా వెళ్ళింది అంటూ వార్తలు వచ్చాయి. దీని పై తాజాగా స్పందించింది హీరోయిన్ కృతి శెట్టి.
కాగా కృతిశెట్టి కార్తీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇప్పుడు హీరోయిన్ గా నటిస్తుందంటూ పై సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ వైరల్ అవుతున్నాయి. 15 ఇయర్స్ ఛాలెంజ్ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఓ ఇంటర్వ్యూలో కృతి శెట్టి మాట్లాడుతూ.. ఆ సినిమాలో ఉన్నది నేను కాదు. నేను అంత చిన్న వయసులో నటించలేదు. నేను మొదటి ఓ మ్యాగజైన్ లో నటించాను అంతే.. ఆ మీమ్స్ ను నేను కూడా చూశా.? నాఫ్రెండ్స్ కూడా చాలా మంది ఆ మీమ్స్ పంపించి అది నువ్వేనా అని అడిగారు అని తెలిపింది కృతి శెట్టి. ప్రస్తుతం ఈ అమ్మడు కార్తీ హీరోగా నటిస్తున్న సినిమాలో ఆయన సరసన హీరోయిన్ గా చేస్తుంది. వా వాతియార్ అనే సినిమాలో కార్తీకి జోడీగా కృతిశెట్టి నటిస్తుంది. నలన్ కుమారసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..