Krithi Shetty: దేవుడిపైనే భారం వేస్తోన్న ఉప్పెన బ్యూటీ.. ఆ సినిమా హిట్ అవ్వాలంటూ ప్రత్యేక పూజలు

|

Sep 03, 2022 | 8:09 AM

టాలీవుడ్ లో కొత్తఅందాలకు కొదవే లేదు.. ఈ మధ్యకాలంలో యంగ్ బ్యూటీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.

Krithi Shetty: దేవుడిపైనే భారం వేస్తోన్న ఉప్పెన బ్యూటీ.. ఆ సినిమా హిట్ అవ్వాలంటూ ప్రత్యేక పూజలు
Krithi Shetty
Follow us on

టాలీవుడ్ లో కొత్త అందాలకు కొదవే లేదు.. ఈ మధ్యకాలంలో యంగ్ బ్యూటీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇలా వచ్చిన ముద్దుగుమ్మల్లో కృతి శెట్టి ఒకరు. ఉప్పెన సినిమాతో ఎగసిపడిన ఈ అందం కృతి శెట్టి(Krithi Shetty). తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకుంది ఈ భామ. ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ భామ. యంగ్ హీరోల సరసన నటిస్తూ దూసుకుపోతున్న ఈ బ్యూటీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజక వర్గం.. ఇటీవలే ఈ బ్యూటీకి ఫస్ట్ ఫ్లాప్ ఎదురైంది. రీసెంట్ గా కృతి నటించిన వారియర్ సినిమా దారుణంగా నిరాశ పరిచింది. రామ్ హీరోగా వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. అలాగే నితిన్ హీరోగా వచ్చిన మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. అయినా కూడా ఈ అమ్మడికి ఆఫర్లకు వస్తున్నాయి.

కానీ కృతి శెట్టికి మంచి హిట్ పడాల్సిందే.. లేకుంటే కేరీర్ గల్లంతయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం కృతి సుధీర్ బాబు సరసన నటిస్తోంది. ఈ సినిమా కు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలి’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ  సినిమా విడుదల కానుంది. ఈ సినిమా హిట్ కావాలని కృతి శెట్టి తన తల్లితో కలిసి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు తెలుస్తోంది.ఆ అమ్మాయి గురించి చెప్పాలి  సినిమా హిట్ అయితే దేవుడికి వెండి కిరీటం చేయిస్తానని భారీ మొక్కును కూడా మొక్కినట్టు టాక్. ఇటీవలే తన తల్లితో కలిసి కృతి శెట్టి గురికి వెళ్లిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ అమ్మడి కోరిక నెరవేరుతుందేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి