రెబల్ స్టార్ కృష్ణంరాజు అకాల మరణాన్ని ప్రభాస్ కుటుంబసభ్యులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలకు చికిత్స పొందుతున్న ఆయన సెప్టెంబర్ 11న తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు, దశదినకర్మలను హైదరాబాద్లోనే నిర్వహించారు. ఇక ఇప్పుడు కృష్మంరాజు సంస్మరణ సభను ఆయన సొంత గ్రామం మొగల్తూరులో నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 29న జరగబోయే సంస్మరణ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రభాస్ తోపాటు.. కుటుంబసభ్యులు పాల్గోననున్నారు. దాదాపు పన్నేండేళ్ల తర్వాత ప్రభాస్ తన సొంత గ్రామానికి వెళ్తున్నారు.
అలాగే ఈ కార్యక్రమానికి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గోనున్నారు. అలాగే సుమారు 50 నుండి 75 వేల మంది కృష్ణం రాజు, ప్రభాస్ అభిమానులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. దాదాపు 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా 70 మందికి భోజనం ఏర్పా్ట్లు కూడా జరుగుతున్నాయి.
మరోవైపు ప్రభాస్ కుటుంబసభ్యులు మొగల్తూరుకు పయనమైనట్లుగా తెలుస్తోంది. దాదాపు పన్నెండేళ్ల తర్వాత ప్రభాస్ మొగల్తూరుకు వస్తుండడంతో పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహిస్తున్నారు. అలాగే చిన్న గ్రామం కావడంతో ఎవరు ఇబ్బంది పడకుండా దారి పొడవునా బారికేట్లతో విభజించి ఏర్పాట్లు చేస్తున్నారు.