Krishnam Raju death: ‘రెబల్ స్టార్’ కి నిజమైన నిర్వచనం.. కృష్ణంరాజు మృతికి సంతాపం తెలుపుతోన్న సినిమా తారలు

|

Sep 11, 2022 | 2:00 PM

సినీలోకం శోకసందంలో మునిగిపోయింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju Death )అనారోగ్యంతో కన్నుమూశారు. 83 ఏళ్ల కృష్ణం రాజు అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున..

Krishnam Raju death: రెబల్ స్టార్ కి నిజమైన నిర్వచనం.. కృష్ణంరాజు మృతికి సంతాపం తెలుపుతోన్న సినిమా తారలు
Tollywood

రెబ‌ల్ స్టార్‌… ఈ ప‌దం విన‌గానే సినిమా ప్రియుల్లో అదో ర‌క‌మైన ఉత్సాహం. ఇన్నాళ్లు ఉర‌కలు వేసిన ఈ ఆనందం, ఇప్పుడు మూగ‌బోయింది. రెబ‌ల్ అభిమానుల్లో మాత్ర‌మే కాదు, యావ‌త్ సినిమా ప‌రిశ్ర‌మ‌లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు(Krishnam Raju) ఇక లేరు. రెబల్ స్టార్‌గా పాపుల‌ర్ అయిన కృష్ణం రాజు సొంత‌పేరు ఉప్ప‌ల‌పాటి వెంక‌ట కృష్ణంరాజు. తెలుగు సినిమా క‌థానాయ‌కుడిగా, నిర్మాత‌గా, రాజ‌కీయ‌వేత్త‌గా వెలుగు వెలిగిన కృష్ణంరాజు ఆదివారం తెల్ల‌వారు జామున తుదిశ్వాస విడిచారు. గ‌త కొన్నాళ్లుగా అనారోగ్య స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్న ఆయ‌న ప్రైవేటు ఆసుప‌త్రిలో తుదిశ్వాస విడిచారు. విష‌యం తెలియ‌గానే ప్ర‌భాస్ హుటాహుటిన ఏఐజీకి చేరుకున్నారు. ఇక కృష్ణం రాజు మృతి పై సినిమా తారలు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

మెగాస్టార్  చిరంజీవి స్పందిస్తూ.. శ్రీ కృష్ణంరాజు గారు ఇక లేరు అనే మాట ఎంతో మషాదకరం! మా ఊరి హీరో, చిత్ర పరిశ్రమలో నా తొలి రోజుల నుంచి పెద్దన్నలా ఆప్యాయంగా ప్రోత్సహించిన కృష్ణంరాజు గారి తో నాటి ‘మనవూరి పాండవులు’ దగ్గర్నుంచి నేటి వరకు నా అనుబంధం ఎంతో ఆత్మీయమైనది. ఆయన ‘రెబల్ స్టార్’ కి నిజమైన నిర్వచనం. కేంద్ర మంత్రి గా కూడా ఎన్నో సేవలందించారు. ఆయన లేని లోటు వ్యక్తిగతంగా నాకూ, సినీ పరిశ్రమకూ, లక్షలాది మంది అభిమానులకు ఎప్పటికీ తీరనిది ఆయన ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడి లాంటి ప్రభాస్ కీ, నా సంతాపం తెలియచేసుకుంటున్నాను” అంటూ ఎమోషనల్ అయ్యారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 11 Sep 2022 01:53 PM (IST)

    కృష్ణంరాజు ఒక మహావృక్షంలాంటివారు. అలాంటి వృక్షం ఈ రోజు కూలిపోయింది: మెగాస్టార్

    మా అన్నయ్య.. మొగల్తూరి బిడ్డ. కృష్ణంరాజు లేరనే మాట. జీర్ణించుకోలేకపోతున్నా. ఇటీవల ఆయన ఆరోగ్యం గురించి నేనూ ఆరా తీశా. ఇలా జరగడం చాలా విచారకరం. ‘చిలకా గోరింక’ చేసినప్పుడు మొగల్తూరు వస్తే, ఆయన్ను చూడటానికి ఎగబడిన వాళ్లలో నేనూ ఉన్నా. ఆయన బయటకు వచ్చి, చేయి ఊపితే ‘హీరో అంటే ఇలా ఉండాలి’ అనిపించింది. ఆయన మాట్లాడినా, నిలబడినా రాజసం ఉట్టిపడేది. రావుగోపాలరావుగారు ఆయన్ను పేరుతో పిలిచేవారు కాదు. ‘రాజావారు’ అనేవారు. ఆ పిలుపునకు నిలువెత్తు నిదర్శనం. కృష్ణంరాజు ఒక మహావృక్షంలాంటివారు. అలాంటి వృక్షం ఈ రోజు కూలిపోయింది అన్నారు మెగాస్టార్

  • 11 Sep 2022 01:51 PM (IST)

    సినీ దిగ్గజం కృష్ణంరాజు గారు: తారక్

    తెలుగు సినీ దిగ్గజం కృష్ణం రాజు గారు భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన ఆశయాలు, ఆశీర్వాదం ఇండస్ట్రీ పైన ఉండాలని కోరుకుంటున్నా.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నా అన్నారు తారక్.

     

  • 11 Sep 2022 01:44 PM (IST)

    రెబల్ స్టార్ భౌతకకాయన్ని సందర్శించిన తారక్

    Ntr

  • 11 Sep 2022 01:14 PM (IST)

    కృష్ణం రాజు గారు లేరంటే చాలా భాదగా ఉంది :వెంకటేష్

    ఇది నిజంగా ఒక బ్యాడ్ డే.. కృష్ణం రాజుగారు లేరు అనే వార్త వింటే చాలా భాదగా ఉంది. ఒక మంచి మనిషి. ప్రతిఒక్కరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి, ప్రతిఒక్కరిని ప్రేమించే వ్యక్తి కృష్ణం రాజుగారు. ఎన్నో మంచి మెమొరీస్ ఆయనతో ఉన్నాయి. కృష్ణం రాజు గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా అన్నారు వెంకటేష్.

    Venkatesh

  • 11 Sep 2022 01:10 PM (IST)

    కృష్ణం రాజు పార్థీవ దేహాన్ని సందర్శించిన వెంకటేష్..

    Venkatesh

  • 11 Sep 2022 01:07 PM (IST)

    నా జీవితంలో మొదటి హీరో.. మా ఇంట్లో మాట్లాడుకునేది కృష్ణంరాజు గారే: పవన్ కళ్యాణ్

    రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ సేవలందించిన కృష్ణం రాజు గారు మరణించం బాధాకరం.. అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి కృష్ణం రాజు గారు.నా జీవితంలో మొదటి హీరో.. మా ఇంట్లో మాట్లాడుకునేది కృష్ణంరాజు గారే.. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు పవన్

  • 11 Sep 2022 01:03 PM (IST)

    కృష్ణం రాజు భౌతికకాయానికి పవన్ నివాళులు

    Pawan Kalyan

  • 11 Sep 2022 12:49 PM (IST)

    కృష్ణం రాజు భౌతికకాయం వద్ద చిరంజీవి

    Megstar

  • 11 Sep 2022 12:43 PM (IST)

    కృష్ణం రాజు భౌతికకాయాన్ని సందర్శించిన మహేష్ బాబు

    Maheash Babu

  • 11 Sep 2022 12:25 PM (IST)

    ఇంటికి చేరుకున్న కృష్ణంరాజు భౌతికకాయం

    నటుడు కృష్ణంరాజు భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రి నుంచి ఇంటికి తరలించారు. అనంతరం అభిమానుల సందర్శనార్థం ఉంచారు.

    Krishnam Raju

  • 11 Sep 2022 12:05 PM (IST)

    తెలుగు సినిమాకు ఆయన ఓ స్ట్రాంగ్ పిల్లర్ : శ్రీకాంత్

  • 11 Sep 2022 12:02 PM (IST)

    నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా : శ్రీవిష్ణు

  • 11 Sep 2022 12:01 PM (IST)

    నా హృదయంలో ఆయనకు ప్రత్యేకస్థానం ఎప్పుడూ ఉంటుంది : రాధికా శరత్ కుమార్

  • 11 Sep 2022 11:59 AM (IST)

    చిరునవ్వు ,ఆప్యాయత ఎల్లప్పుడూ నాకు చాలా విశ్వాసాన్ని ఇస్తుంది: సందీప్ కిషన్

  • 11 Sep 2022 11:56 AM (IST)

    కోలుకోలేని నష్టం.. మరో శకం ముగిసింది : హను రాఘవపూడి

  • 11 Sep 2022 11:54 AM (IST)

    ఇండస్ట్రీకి మీరు చేసిన సేవలు మరిచిలేనివి : సాయి ధరమ్ తేజ్

  • 11 Sep 2022 11:50 AM (IST)

    కృష్ణం రాజు మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన కేటీఆర్

  • 11 Sep 2022 11:46 AM (IST)

    నిజంగా షాకింగ్ ఉంది : నాగశౌర్య

  • 11 Sep 2022 11:42 AM (IST)

    ఆయన తన అద్భుత నటనతో అశేష అభిమానం సంపాదించుకున్నారన్నారు: కేసీఆర్‌

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) కృష్ణంరాజు మృతికి సంతాపం తెలిపారు. ఆయన మరణం వెండితెరకు తీరని లోటని అభివర్ణించారు. కేంద్రమంత్రిగా దేశ ప్రజలకు సేవలందించారని గుర్తుచేసుకున్నారు. ఆయన తన అద్భుత నటనతో అశేష అభిమానం సంపాదించుకున్నారన్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు కేసీఆర్‌ పేర్కొన్నారు.

     

  • 11 Sep 2022 11:35 AM (IST)

    ఆయన సినిమాలు రాబోయే తరానికి మార్గదర్శనం: ప్రధాని మోడీ

    ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా కృష్ణం రాజు మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృష్ణం రాజు సినిమాలపై కూడా ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. కృష్ణంరాజు మృతి చెందడం ఎంతో బాధాకరమని.. ఆయన సినిమాలు రాబోయే తరానికి మార్గదర్శనం చేస్తాయన్నారు. కృష్ణం రాజు సినిమాల్లోని మాధుర్యం, సృజనాత్మకతను భవిష్యత్తు తరాలు అందిపుచ్చుంటాయని ట్వీట్ లో పేర్కొన్నారు. సామాజిక సేవలోనూ ముందుండే ఆయన రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. కృష్ణంరాజుకుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  • 11 Sep 2022 11:32 AM (IST)

    సమాజ సేవతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు: అమిత్ షా

    తెలుగు సినిమా దిగ్గజ నటుడు, కేంద్ర మాజీ మంత్రి శ్రీ యు కృష్ణంరాజు గారు మనల్ని విడిచిపెట్టారని తెలి‌సి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. అతను బహుముఖ నటనతో మరియు సమాజ సేవతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ఆయన మరణం మన తెలుగు చిత్రసీమకు తీవ్ర లోటును మిగిల్చింది. ఓం శాంతి.

  • 11 Sep 2022 11:29 AM (IST)

    చిత్రసీమకు రెబల్‌స్టార్‌ మృతి తీరనిలోటు : ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచంద్‌

    ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచంద్‌ కృష్ణం రాజు మరణంపై వ్యక్తం చేశారు. చిత్రసీమకు రెబల్‌స్టార్‌ మృతి తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులకు సంఘీభావం ప్రకటించారు.

     

  • 11 Sep 2022 11:28 AM (IST)

    రెబ‌ల్ స్టార్‌ కృష్ణంరాజు గారి మృతి బాధాకరం: సీఎం జగన్

    ప్రముఖ సీనియర్‌ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు (Krishnam Raju ) మృతి పట్ల ఏపీ సీఎం జగన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. రెబల్‌స్టార్‌ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. అదేవిధంగా కృష్ణం రాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

  • 11 Sep 2022 11:25 AM (IST)

    రెబల్‌స్టార్‌ మరణవార్త విని తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యా: చంద్రబాబు నాయుడు

    టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రెబల్‌స్టార్‌ మరణవార్త విని తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. ‘ప్రముఖ నటులు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు గారి మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నటునిగా విభిన్న పాత్రలలో మెప్పించిన ఆయన రాజకీయాలలో కూడా నిజాయతీతో ప్రజలకు సేవలు అందించారు. ఆయన మృతి తెలుగు నేలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

  • 11 Sep 2022 11:23 AM (IST)

    కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారనే వార్త దిగ్భ్రాంతి కలిగించింది: పవన్ కళ్యాణ్

    ‘తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పంథాను కలిగిన నటులు కృష్ణంరాజు. రౌద్ర రస ప్రధానమైన పాత్రలను ఎంతగా మెప్పించేవారో కరుణ రసంతో కూడిన పాత్రల్లోనూ అలాగే ఒదిగిపోయేవారు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు పొందిన ఆయన తుదిశ్వాస విడిచారనే వార్త దిగ్భ్రాంతి కలిగించింది. ఇటీవలి కాలంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారని తెలిసినప్పుడు కోలుకొంటారనే భావించాను. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. మా కుటుంబంతో కృష్ణంరాజు గారికి స్నేహసంబంధాలు ఉన్నాయి. 1978లో ‘మన వూరి పాండవులు’ చిత్రంలో ఆయనతో కలిసి అన్నయ్య చిరంజీవి నటించారు. మొగల్తూరు గ్రామవాసులు కావడంతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. సినీ జీవితంలోనూ, ప్రజా జీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా వారు అందించిన సేవలు మరువలేనివి. కృష్ణంరాజు కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’’

    -పవన్‌కల్యాణ్‌

  • 11 Sep 2022 11:18 AM (IST)

    నాకు చాలా బాధాకరమైన రోజిది : మహేష్ బాబు

    ‘కృష్ణంరాజు గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. నాకు, చిత్ర పరిశ్రమకు చాలా బాధాకరమైన రోజిది. కృష్ణంరాజు గారి జీవితం, పని చేసిన విధానం, సినిమాకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రభాస్‌, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

  • 11 Sep 2022 11:17 AM (IST)

    ఇండస్ట్రీకి మీరు చేసిన సేవలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి: మంచు మనోజ్

  • 11 Sep 2022 11:15 AM (IST)

    కృష్ణంరాజు మృతి పై విచారం వ్యక్తం చేసిన ఎన్టీఆర్

  • 11 Sep 2022 11:13 AM (IST)

    50 సంవత్సరాల స్నేహం మాది.. చాలా భాదగా ఉంది: సూపర్ స్టార్ కృష్ణ

    కృష్ణంరాజు మృతిపట్ల సీనియర్‌ నటుడు కృష్ణ విచారం వ్యక్తం చేశారు. 50 సంవత్సరాల స్నేహం మాది. ఇద్దరం ఒకే సారి ఇండస్ట్రీకి పరిచయం అయ్యాం. పలు సినిమాల్లో కలిసి నటించాం.. ఎంతో మంచి మనిషి. అలాంటి కృష్ణం రాజు ఈ మధ్య లేకపోవడం చాలా భాదగా ఉంది అని ఎమోషనల్ అయ్యారు కృష్ణ..

  • 11 Sep 2022 11:09 AM (IST)

    విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్ గా ఎదిగారు: లోకేష్ నారా

    సినీ, రాజకీయ రంగాలలో కృష్ణంరాజు గారిది చెరగని ముద్ర. విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్ గా ఎదిగారు. ప్రజా సేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించి కేంద్ర మంత్రిగా ఎంతో కృషి చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను.

  • 11 Sep 2022 11:07 AM (IST)

    కృష్ణంరాజు పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని భగవంతుని ప్రార్థిస్తున్నా: సోమువీర్రాజు

    ఉభయగోదావరి జిల్లా నుండి బీజేపీ  తరపున కేంద్ర మంత్రిగా సేవలందించిన మాజీ పార్లమెంట్ సభ్యులు కృష్ణంరాజు గారి మరణం దిగ్భ్రాంతిని కలిగించింది.వారి పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని సోమువీర్రాజు అన్నారు. 

  • 11 Sep 2022 11:04 AM (IST)

    కృష్ణం రాజుతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న బీజేపీ నేతలు

    బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు సోము వీర్రాజు, తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్, మాజీ గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్ రావుతో పాటు పలువురు బీజేపీ నాయకులు కృష్ణం రాజు మృతిపట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని బీజేపీ నాయకులు వేర్వేరుగా విడుదల చేసిన సంతాప ప్రకటనలో పేర్కొన్నారు.

  • 11 Sep 2022 11:03 AM (IST)

    ప్రజల శ్రేయస్సును ఆలోచించిన గొప్ప మనిషి: కిషన్ రెడ్డి

    ‘రెబల్ స్టార్’గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఉప్పలపాటి కృష్ణంరాజు ఇకలేరని తెలిసి విచారం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. పాత్రికేయుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి నటుడిగా, బీజేపీ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా, పారిశ్రామిక వేత్తగా అవకాశం వచ్చిన ప్రతిచోటా తనదైన ముద్రవేసుకున్న మహనీయుడు శ్రీ కృష్ణంరాజు అని అన్నారు.ఆ నిరంతరం ప్రజల శ్రేయస్సును ఆలోచించిన గొప్ప మనిషి అని అన్నారు

  • 11 Sep 2022 10:45 AM (IST)

    అనుష్క స్పందిస్తూ..

    అనుష్క స్పందిస్తూ.. మీరెప్పటికీ మా గుండెల్లోనే ఉంటారు. కృష్ణంరాజుగారి ఆత్మకు శాంతి చేకూరాలి.. అంటూ తన ఇన్ స్టా గ్రామ్ లో ఆయనతో పటు దిగిన ఫోటోను షేర్ చేసింది.

  • 11 Sep 2022 10:44 AM (IST)

    యంగ్ హీరో నిఖిల్ ట్వీట్

    ఒక లెజెండ్ మనల్ని వదిలి వెళ్లిపోయారు అని యంగ్ హీరో నిఖిల్ ట్వీట్ చేశాడు.

  • 11 Sep 2022 10:43 AM (IST)

    యంగ్ హీరో శర్వానంద్ ట్విట్

    మనసు ముక్కలు చేసింది అని యంగ్ హీరో శర్వానంద్ ట్విట్టర్ ద్వారా కృష్ణం రాజుకు ఆత్మకు శాంతి చేకూరాలి అని పోస్ట్ చేశారు.

  • 11 Sep 2022 10:43 AM (IST)

    మంచు విష్ణు ట్వీట్..

    కృష్ణంరాజు మరణ వార్త విని హృదయం బద్దలైందని మంచు విష్ణు ట్వీట్ చేశారు..

    Heartbroken ?. #KrishnamRaju ? Our family has lost our elder. A Legend.

    — Vishnu Manchu (@iVishnuManchu) September 11, 2022

  • 11 Sep 2022 10:42 AM (IST)

    మంచు మోహన్ బాబు స్పందిస్తూ..

    మంచు మోహన్ బాబు స్పందిస్తూ.. మాటలు రావడం లేదు అంటూ ట్వీట్ చేశారు మోహన్ బాబు

  • 11 Sep 2022 10:41 AM (IST)

    కృష్ణంరాజు మృతికి చిరంజీవి సంతాపం

    మెగాస్టార్  చిరంజీవి స్పందిస్తూ.. శ్రీ కృష్ణంరాజు గారు ఇక లేరు అనే మాట ఎంతో మషాదకరం! మా ఊరి హీరో, చిత్ర పరిశ్రమలో నా తొలి రోజుల నుంచి పెద్దన్నలా ఆప్యాయంగా ప్రోత్సహించిన కృష్ణంరాజు గారి తో నాటి ‘మనవూరి పాండవులు’ దగ్గర్నుంచి నేటి వరకు నా అనుబంధం ఎంతో ఆత్మీయమైనది.

Follow us on