Raviteja: భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన మాస్‌ మహారాజ… 68వ చిత్రానికి అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్నాడా.?

|

Feb 23, 2021 | 1:38 PM

Ravi Teja Increased His Remuneration: ఒక్క విజయం ఎంతో శక్తిని ఇస్తుంది. అప్పటి వరకు వరుస పరాజయలతో ఉన్న వారికి కూడా ఒక్క విజయం ఎక్కడ లేని ఉత్సాహాన్ని నింపుతుంది. ప్రస్తుతం ఇలాంటి మూడ్‌లోనే ఉన్నాడు మాస్‌ మహారాజ రవితేజ...

Raviteja: భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన మాస్‌ మహారాజ... 68వ చిత్రానికి అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్నాడా.?
Follow us on

Ravi Teja Increased His Remuneration: ఒక్క విజయం ఎంతో శక్తిని ఇస్తుంది. అప్పటి వరకు వరుస పరాజయలతో ఉన్న వారికి కూడా ఒక్క విజయం ఎక్కడ లేని ఉత్సాహాన్ని నింపుతుంది. ప్రస్తుతం ఇలాంటి మూడ్‌లోనే ఉన్నాడు మాస్‌ మహారాజ రవితేజ. ‘రాజా ది గ్రేట్‌’ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో విజయాన్ని అందుకోలేక సతమతమవుతోన్న సమయంలో ‘క్రాక్‌’ సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను దక్కించుకున్నాడీ మాస్‌ హీరో.

ఇక ఈ సినిమా ఇచ్చిన కిక్‌తో ఒక్కసారిగా సినిమాల్లో వేగం పెంచాడు. ఇప్పటికే ‘ఖిలాడి’ షూటింగ్‌లో బిజీగా ఉన్న రవితేజ తాజాగా మరో సినిమాకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా రవితేజ తన కెరీర్‌లో 68వ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ‘నేను లోకల్‌’, ‘హలో గురు ప్రేమ కోసమే’ వంటి చిత్రాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు త్రినాథరావు నక్కినతో చేతులు కలిపాడు రవి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. రవివేజ ఈ సినిమా కోసం ఏకంగా రూ.16 కోట్లు డిమాండ్‌ చేస్తున్నాడనేది ఈ వార్త సారాంశం. ‘క్రాక్‌’ సినిమాతో తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు రవితేజ. సరైన సినిమా పడాలే కానీ.. కలెక్షన్లకు ఎలాంటి ఢోకా ఉండదని భావించిన చిత్ర యూనిట్‌ రవితేజ అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. ఇది తెలిసిన రవితేజ అభిమానులు మాత్రం ఫుల్‌ ఖుషీలో ఉన్నారు.

Also Read: Drishyam 2: హిందీలో రెండో దృశ్యం చూపించనున్నారు.. దర్శకుడు మరణించాడుగా.. మరి ఎవరు తెరకెక్కిస్తారు.?