Kota Bommali PS Twitter Review: థ్రిల్లింగ్ కాన్సెప్ట్‏తో  ‘కోటబొమ్మాళి పీఎస్’.. గూస్‏బంప్స్ గ్యారెంటీ అంటూ ట్వీట్స్..

చిన్న చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి కేవలం ఈ ఒక్క పాట మాత్రమే లెక్కలేనంత పాపులారిటిని తీసుకువచ్చింది. ఇక ఈ పాటలోని హుక్ స్టెప్ నెట్టింట ఎంత ఫేమస్ అనేది చెప్పక్కర్లేదు. కోటబొమ్మాళి పీఎస్ సినిమా ఇప్పుడు అడియన్స్ ముందుకు వచ్చింది. సీనియర్ హీరో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీ నవంబర్ 24న థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్ షోస్ వేశారు.

Kota Bommali PS Twitter Review: థ్రిల్లింగ్ కాన్సెప్ట్‏తో  కోటబొమ్మాళి పీఎస్.. గూస్‏బంప్స్ గ్యారెంటీ అంటూ ట్వీట్స్..
Kotabommali Ps Movie

Updated on: Nov 24, 2023 | 9:04 AM

ఇప్పుడు ఎక్కడ విన్నా లింగి లింగి లింగిడి అనే సాంగ్ తెగ హల్చల్ చేస్తుంది. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న ఈ ఫోక్ సాంగ్‍కు చిన్నా, పెద్ద స్టెప్పులేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. ఒక్క పాటతో జనాల్లోకి వెళ్లిపోయింది కోటబొమ్మాళి సినిమా. చిన్న చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి కేవలం ఈ ఒక్క పాట మాత్రమే లెక్కలేనంత పాపులారిటిని తీసుకువచ్చింది. ఇక ఈ పాటలోని హుక్ స్టెప్ నెట్టింట ఎంత ఫేమస్ అనేది చెప్పక్కర్లేదు. కోటబొమ్మాళి పీఎస్ సినిమా ఇప్పుడు అడియన్స్ ముందుకు వచ్చింది. సీనియర్ హీరో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీ నవంబర్ 24న థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్ షోస్ వేశారు. ఇక ఉదయం నుంచే ఈ సినిమాపై ట్విట్టర్ వేదికగా అభిప్రాయాలు తెలియజేస్తున్నారు.

మొదట ఈ మూవీపై డైరెక్టర్ హరీష్ శంకర్ తన స్టైల్లో రివ్యూ ఇచ్చారు. కోటబొమ్మాళి సినిమాలో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్‌కుమార్ మధ్య స్క్రీన్ ప్లే బాగుందని.. ఇక వారిద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ ఆట థియేటర్‌లలో ప్రతి ఒక్కరినీ వారి వారి సీట్లకు అతుక్కుపోయేలా చేస్తుందట. చాలా కాలం తర్వాత శ్రీకాంత్ గారికి అద్భుతమైన పాత్ర వచ్చిందని.. ఆయన నటన ప్రేక్షకులకు గూస్‌బంప్స్ రావడం ఖాయమని.. ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లో అందరికీ కనెక్ట్ అయ్యే ఎమోషనల్ పార్ట్ ఉందంటూ ట్వీట్ చేశారు. అలాగే ఇప్పటికే ఉన్న సిస్టమ్ గురించి కొన్ని బోల్డ్, పవర్ ఫుల్ డైలాగ్‌లు ఉన్నాయి. నిర్మాతల ధైర్యాన్ని నిజంగా అభినందిస్తున్నాను. ఇతరులు దీనికి ఎలా స్పందిస్తారో ఖచ్చితంగా తెలియదు అంటూ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

అలాగే హీరో నిఖిల్ సిద్ధార్త్ స్పందిస్తూ.. ఈ మూవీ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అని.. ప్రతి ఎమోషనల్ పార్ట్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందంటూ ట్వీట్ చేశారు. చేత్తో పాము పట్టుకుని ఎదురుగా చూస్తూ పక్కకు అలా విసిరేసింది వరలక్ష్మి శరత్ కుమార్. ఆ విజువల్ నెట్టింట షేర్ చేస్తూ.. వరలక్ష్మీ పాత్ర ఎలా ఉంటుందో చెప్పేస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.