Kota Srinivasa Rao: జబర్ధస్త్, బిగ్ బాస్ షోలపై, అందులోని ఆర్టిస్టులపై సంచలన కామెంట్స్ చేసిన విలక్షణ నటుడు

Kota Srinivasa Rao: టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు విలక్షణ నటుడే కాదు... తన మనసులో మాటను సమయం వస్తే నిర్మొహమాటంగా చెప్పేసే వ్యక్తి. టాలీవుడ్ లో..

Kota Srinivasa Rao: జబర్ధస్త్, బిగ్ బాస్ షోలపై, అందులోని ఆర్టిస్టులపై సంచలన కామెంట్స్ చేసిన విలక్షణ నటుడు
Kota Srinivasa Rao

Edited By:

Updated on: Jul 19, 2021 | 8:09 PM

Kota Srinivasa Rao: టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు విలక్షణ నటుడే కాదు… తన మనసులో మాటను సమయం వస్తే నిర్మొహమాటంగా చెప్పేసే వ్యక్తి. టాలీవుడ్ లో వారసత్వం హీరోల మీద , నెపోటిజమ్‌పై , తెలుగు సినిమాల్లో అరువు నటులు అంటూ.. ఇలా వివాదాస్పద కామెంట్స్ చేసే కోటా శ్రీనివాసరావు తాజాగా ప్రముఖ షోల్లో చేస్తున్న ఆర్టిస్టులపై సంచలన కామెంట్స్ చేశారు.
బిగ్ బాస్, జబర్దస్త్ షోల్లో చేస్తున్న నటీనటులపై కోటా షాకింగ్ కామెంట్స్ చేశారు.. ఈ షోల్లో ఆర్టిస్టులు ఏవేవో పిచ్చి పనులు చేస్తుంటారు.. అటువంటి వారి గురించి వారి నటన గురించి ఏమని చెప్పాలి అన్నారు.

అంతేకాదు ఒక షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను కోటా శ్రీనివాసరావు గుర్తు చేసుకున్నారు. ఆ మధ్య ఒక సినిమా షూటింగ్ సమయంలో పొట్టిగా గెడ్డం పెంచుకునిఒకడున్నాడు.. కేరవాన్ లో ఇద్దరు ఆర్టిస్ట్‌లకు ఒకే రూం ఇస్తే ఎట్టా అని అరుస్తున్నాడు. మేనేజర్ తో గొడవపడుతున్నాడు.. వాళ్ళు ఎవరో నాకు తెలియదు.. దీంతో నేను ఎవరు వాళ్ళు అలా గొడవ పడుతున్నారు అని అడిగితె.. జబర్దస్త్ ఆర్టిస్టులు అని చెప్పారు..నేను జబర్దస్త్ అంటే.. జబర్దస్త్‌గా యాక్ట్ చేస్తాడేమో అనుకున్నా.. తీరా చూస్తే తర్వాత తెలిసింది.. వాళ్ళు గొప్పగా యాక్ట్ చేసేవాళ్ళు కాదని.. జబర్దస్త్ ప్రోగ్రామ్‌ చేసేవాళ్ళని.. అదీ వాళ్ళ క్వాలిఫికేషన్ .. ఇక అటువంటి వాళ్ళగురించి ఏమి మాట్లాడాలి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.. కోటా శ్రీనివాసరావు.

ఇదే సమయంలో బిగ్ బాస్ షో గురించి కూడా ప్రస్తావించారు. తాను ఎప్పుడూ ఆ షో చూడనని.. పని లేని వాళ్ళు 100 రోజు అక్కడ ఉండడానికి వెళ్తారని.. ఇంట్లో పనిలేని వాళ్ళు ఆ షో చూస్తారని అసలు తాను ఆ షో చూడనని అన్నారు.. అంతేకాదు అసలు ఆ బిగ్ బాస్ షో లో ఏముంటుంది అంటూ తిరిగి ప్రశ్నించారు. అదేమన్నా ప్రపంచానికి పనికి వచ్చేదా..అంటూ కోటా శ్రీనివాస రావు తనదైన శైలిలో ఈ షోస్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

Also Read:  సుమ, రాజీవ్ పై అన్నపూర్ణ సంచలన కామెంట్స్ .. నేను ముందు పోతా.. వాళ్ళు ఇక్కడే ఉంటారా