Chaitanya Jonnalagadda: నిహారిక గురించి మనకు అన్నీ తెల్సు.. చైతన్య గురించి ఈ విషయాలు తెలిస్తే స్టన్ అవుతారు

చైతన్య ఫిట్ నెస్ ఫ్రీక్. డైలీ జిమ్ చేస్తాడు. కఠినమైన డైట్ ఫాలో అవుతాడు. అతడికి గుర్రాలు అంటే చాలా ఇష్టం. వాటితో టైమ్ స్పెండ్ చేయడానికి ఇష్డపడతాడు.

Chaitanya Jonnalagadda: నిహారిక గురించి మనకు అన్నీ తెల్సు.. చైతన్య గురించి ఈ విషయాలు తెలిస్తే స్టన్ అవుతారు
Niharika Konidela - Chaitanya Jonnalagadda

Updated on: Mar 27, 2023 | 8:33 PM

చైతూ జొన్నలగడ్డ.. కోణిదెల నాగబాబు గారాలపట్టి నిహారకను వివాహం చేసుకుని ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఎంతో గ్రాండ్‌గా చైతన్య, నిహారికల వివాహా వేడుక జరిగింది. అయితే ఇటీవల కాలంలో వీరి మధ్య వివాదాలు చెలరేగాయని, త్వరలో వేరు అవ్వబోతున్నారని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లుగానే ఇద్దరూ ఒకర్ని మరొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో అవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో వీరు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నారు. నిహారిక గురించి మనకు అన్ని విషయాలు తెల్సు. చైతన్య జొన్నలగడ్డకు సంబంధించిన పలు వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చైతన్య జొన్నలగడ్డ హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. తరువాత, రాజస్థాన్‌లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుండి గణితంలో మాస్టర్స్ ఆఫ్ సైన్స్ డిగ్రీ చేశాడు. ఆపై హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ పొందాడు. కాలేజ్ డేస్‌లో.. స్టూడెంట్స్ యూనియన్‌ లీడర్‌గా పనిచేశాడు చైతన్య. బలమైన నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించాడు. అతను తన చదువు పూర్తయిన తర్వాత వివిధ సంస్థలలో ఇంటర్న్ షిప్ చేసి.. వ్యాపారరంగంలో మంచి అనుభవం సంపాదించాడు.

చైతన్య తండ్రి జొన్నలగడ్డ ప్రభాకరరావు పోలీసు అధికారి. ప్రస్తుతం ఆయన గుంటూరులో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తున్నారు. చైతన్య తాత వెంకటేశ్వర్లు జొన్నలగడ్డ కూడా ఇన్‌స్పెక్టర్‌. చైత‌న్య త‌ల్లి గృహిణి. అతనికి దీపిక అనే ఒక అక్క ఉంది. ఆమె తన భర్తతో కలిసి USA లో ఉంటుంది.  చైతన్య ప్రముఖ సౌత్ ఇండియన్ నటి, నిర్మాత నిహారిక కొణిదెలను వివాహం చేసుకున్నాడు. వీరి ఎంగేజ్‌మెంట్ ఆగస్టు 13, 2020న జరిగింది. డిసెంబర్ 9, 2020న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.

చైతన్య జొన్నలగడ్డ హైదరాబాద్‌లోని ప్రభుత్వ సలహా సంస్థ KPMGలో అసిస్టెంట్ మేనేజర్‌గా తన కెరీర్ స్టార్ట్ చేశాడు. GMR గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో ఇంటర్న్‌గా పనిచేశాడు. ప్రాసెస్‌వీవర్‌లో బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్,  సీనియర్ బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా వర్క్ చేశాడు. అతను ప్రస్తుతం, టెక్ మహీంద్రా గ్రూప్‌లో జాబ్ చేస్తున్నాడు. అక్కడ ప్రొడక్ట్ ఓనర్ కమ్ మేనేజర్‌గా మంచి స్కిల్స్ చూపించి బిజినెస్ స్ట్రాటజిస్ట్‌గా ప్రమోషన్ పొందాడు. నెస్లే, IBM, Airtel తో పాటు అనేక ఇతర ప్రముఖ భారతీయ కంపెనీలలో అతడు పెట్టుబడి పెట్టాడు. చైతన్యకు 3 మిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..