Sivakarthikeyan: ముచ్చటగా మూడోసారి తండ్రి కానున్న హీరో శివ కార్తికేయన్.. బేబీ బంప్‌తో భార్య.. వీడియో వైరల్

|

May 30, 2024 | 9:11 PM

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్‌ త్వరలో తండ్రి కాబోతున్నాడా? అతని భార్య ఆర్తి ప్రస్తుతం గర్బంతో ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో. దీనికి సంబంధించి ఒక వీడియో ఇప్పుడు సామాజి క మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.

Sivakarthikeyan: ముచ్చటగా మూడోసారి తండ్రి కానున్న హీరో శివ కార్తికేయన్.. బేబీ బంప్‌తో భార్య.. వీడియో వైరల్
Sivakarthikeyan Family
Follow us on

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్‌ త్వరలో తండ్రి కాబోతున్నాడా? అతని భార్య ఆర్తి ప్రస్తుతం గర్బంతో ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో. దీనికి సంబంధించి ఒక వీడియో ఇప్పుడు సామాజి క మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ఇందులో ఆర్తి బేబీ బంప్ తో కనిపించారు. శివకార్తికేయన్‌- ఆర్తి దంపతులకు ఇదివరకే ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో చాలాకాలం తర్వాత ఈ దంపతులు మూడో బిడ్డ కోసం ప్లాన్‌ చేశారని రూమర్స్ వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. తాజాగా ఓ అభిమాని పుట్టిన రోజు ఫంక్షన్ కు శివ కార్తికేయన్ హాజరయ్యాడు. అతని వెంట భార్య ఆర్తి, కూతురు ఆరాధన కూడ ఉన్నారు.  అయితే ఈ వీడియోలో ఆర్తికి కాస్త పొట్ట ఉన్నట్లుగా కనిపించింది. ఈ వీడియోను చూసిన జనాలు అది బేబీ బంప్‌ అయి ఉండొచ్చని అభిప్రాయ పడుతున్నారు. త్వరలో మరో జూనియర్‌ శివకార్తికేయన్‌ రాబోతున్నాడని అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. అభిమానులు, నెటిజన్లు శివ కార్తికేయన్ దంపతులకు ముందుగానే విషెస్ చెబుతున్నారు.

కాగా శివ కార్తికేయన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. 2010లో ఆర్తిని వివాహం చేసుకున్నాడు. వీరి ప్రేమ బంధానికి ప్రతీకగా 2013లో కూతురు ఆరాధన, 2021లో కుమారుడు గుగన్‌ దాస్‌ జన్మించారు. కాగా శివ కార్తికేయన్ భార్య ఆర్తికి కన్నడ సినిమా ఇండస్ట్రీతో పరిచయం ఉంది. కనా అనే కన్నడ మూవీలో వాయడి పేట పుల్ల అనే సాంగ్‌ ఆలపించి బాగా ఫేమస్ అయిపోంది. ఇక శివ కార్తికేయన్ కూడా మంచి సింగర్. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అమరన్ అనే సినిమాలో నటిస్తున్నాడు శివ కార్తికేయన్. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఇందులో మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌గా కనిపించనున్నాడు ఎస్ కే ఆర్. ఆ తర్వాత ఏఆర్‌ మురుగదాస్‌తో ఓ సినిమా చేయనున్నాడీ స్టార్ హీరో.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.