Amala Paul: ‘అమలా పాల్‌ ఓ చెత్త హీరోయిన్..’ దుమారం లేపుతోన్న యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్

ఓ హీరో ఏమాత్రం మొహమాటపడకుండా తనతో నటించిన స్టార్‌ హీరోయిన్‌ గురించి షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఇక అంతే అదికాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అతనెవరో కాదు.. అథర్వ మురళి.. తమిళనాట నటుడు అథర్యకు లక్కీ హీరో అనే పేరుంది. అతను నటించిన చాలా సినిమాలు హిట్‌ అవ్వడమే అందుకు కారణం. అలాగే అథర్వతో నటించిన హీరోయిన్లు కూడా పాపులారిటీ పొందుతున్నారని టాక్‌. సమంత, అమలాపాల్‌ కూడా అలా స్టార్‌ హీరోయిన్లుగా..

Amala Paul: అమలా పాల్‌ ఓ చెత్త హీరోయిన్.. దుమారం లేపుతోన్న యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్
Actress Amala Paul

Updated on: Aug 14, 2023 | 8:37 PM

సెలబ్రెటీల గురించి ఏదైనా కొత్త విషయం తెలిస్తే క్షణాల్లో అంతటా వ్యాపిస్తుంది. వారి ప్రొఫెషనల్‌ లైఫ్‌, పర్సనల్ లైఫ్‌ గురించి తెలుసుకేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపడమే అందుకు కారణం. తాజాగా ఓ హీరో మరో హీరోయిన్‌ గురించి ఓపెన్‌గా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సాధారణంగా తమతో నటించిన హీరోయిన్‌ల గురించి చెప్పమంటే వారిలో మంచి విషయాల గురించే చెబుతుంటారు. కానీ ఓ హీరో ఏమాత్రం మొహమాటపడకుండా తనతో నటించిన స్టార్‌ హీరోయిన్‌ గురించి షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఇక అంతే అదికాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ అతనెవరో కాదు. అథర్వ మురళి.. తమిళనాట నటుడు అథర్వకు లక్కీ హీరో అనే పేరుంది. అతను నటించిన చాలా సినిమాలు హిట్‌ అవ్వడమే అందుకు కారణం. అలాగే అథర్వతో నటించిన హీరోయిన్లు కూడా పాపులారిటీ పొందుతున్నారని టాక్‌. సమంత, అమలాపాల్‌ కూడా అలా స్టార్‌ హీరోయిన్లుగా మారారనే రూమర్‌ కూడా ఉంది. ఐతే దీనిలో ఎంతవరకు నిజం ఉందన్న విషయం పక్కనపెడితే.. తనతో నటించిన హీరోయిన్లలో అమలాపాల్‌ను చెత్తనటిగా అథర్వ చెబుతున్నాడు. అసలింతకీ ఏం జరిగిందంటే..

తన కొత్త వెబ్ సిరీస్ ‘మధకం’ ప్రమోషన్స్‌కు సంబంధించిన ఓ ఇంటర్వ్యూలో అధర్వ మాట్లాడుతూ.. తనతో నటించిన హీరోయిన్లలో ఎవరు చెత్తనటి అనే ప్రశ్నకు సమాధానంగా వెంటనే అమాలాపాల్‌ అనేశాడు.

ఇవి కూడా చదవండి

‘నా రెండో సినిమా ముధుతుమ్ ఉన్ కర్పనైకల్‌లో మేమిద్దరం కలిసి నటించాం. సెట్‌లో చిన్న గొడవ జరిగింది. మొదటి 10 రోజులు నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆ తర్వాత సెట్‌ అయ్యాం. ఆమె ఒక చెత్త హీరోయిన్‌ అనే విషయాన్ని నేను నేరుగా అమలా పాల్‌కి కూడా చెప్పాను అని అధర్వ చెప్పుకొచ్చాడు. అథర్వ తాజా వ్యాఖ్యలు ప్రసుత్తం కోలివుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ కామెంట్స్‌పై అమలాపాల్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Atharva and Amala Paul

కాగా ‘నీలతామర’ అనే మలయాళ సినిమాతో సినీ కెరీర్‌ ప్రారంభించిన అమలాపాల్‌ తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ‘వీర శేఖరన్’ సినిమాతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టిన అమలాపాల్‌ ‘మైనా’, ‘దైవతిరుమకల్’, ‘బెజవాడ’, ‘వెట్టై’ వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత అథర్వతో కలిసి ‘ముధుతుమ్ ఉన్ కర్పనైకల్’ చిత్రంలో నటించింది.

ఇక తమిళ యంగ్‌ హీరో అథర్వ విషయానికొస్తే.. అథర్వ ప్రముఖ తమిళ హీరో మురళి కుమారుడు. 2010లో ‘బాణకాతాడి’ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. తెలుగులో ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. 2013లో కోలీవుడ్‌ మువీ ‘పరదేశి’కి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.