కోటి ఆశలతో ఇండస్ట్రీలోకి.. ఒకే ఒక్క తప్పుతో కెరీర్ క్లోజ్.. చివరకు ఆ వ్యాధితో..

వెండితెర పై స్టార్ హీరోయిన్స్ గా వెలిగిన వారు ఎందరో ఉన్నారు. కొందరు ఇండస్ట్రీకి దూరం అయ్యి , చివరకు అనారోగ్యాలకు గురై.. ఆర్ధిక సమస్యలను ఎదుర్కొనే స్టేజ్ లో ఉన్నారు.  ఓ హీరోయిన్ కూడా పరిస్థితి ఎదుర్కొంది. స్టార్ హీరోయిన్ గా రాణించాల్సిన ఆమె చివరకు అనాధల మరణించాల్సి వచ్చింది.

కోటి ఆశలతో ఇండస్ట్రీలోకి.. ఒకే ఒక్క తప్పుతో కెరీర్ క్లోజ్.. చివరకు ఆ వ్యాధితో..
Actress'

Updated on: Sep 11, 2024 | 1:39 PM

చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో కష్టపడి అవకాశాలు అందుకుంటూ స్టార్స్‌గా రాణిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం చిన్న చిన్న తప్పులు చేసి తమ కెరీర్‌ను చేతులారా పాడు చేసుకున్న వారు కూడా ఉన్నారు. వెండితెర పై స్టార్ హీరోయిన్స్ గా వెలిగిన వారు ఎందరో ఉన్నారు. కొందరు ఇండస్ట్రీకి దూరం అయ్యి , చివరకు అనారోగ్యాలకు గురై.. ఆర్ధిక సమస్యలను ఎదుర్కొనే స్టేజ్ లో ఉన్నారు.  ఓ హీరోయిన్ కూడా పరిస్థితి ఎదుర్కొంది. స్టార్ హీరోయిన్ గా రాణించాల్సిన ఆమె చివరకు అనాధల మరణించాల్సి వచ్చింది. అందం, అభినయం రెండు ఉన్నా ఆమె కలలు నిజం చేసుకోలేకపోయింది. పైన కనిపిస్తున్న నటి జీవితం ఓ విషాదం. హీరోయిన్ గా మరి ఇండస్ట్రీలో రాణించాల్సిన ఆమె .. ఊహించని విధంగా వ్యభిచార వృత్తిలోకి దిగింది. ఆ తర్వాత ఆమె జీవితం విషాదాంతం అయ్యింది.

ఇది కూడా చదవండి : Mahesh Babu: స్టార్ హీరోయిన్స్‌ కూడా కుళ్ళుకుంటారు.. మహేష్ బాబు అన్న కూతురు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..

ఆమె పేరు నిషా నూరు. హీరోయిన్ అవ్వాలని కోటి ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ ఊహించని సంఘటనలు. అనుకోని పరిస్థితుల వల్ల ఆమె తప్పుడు మార్గాన్ని ఎంచుకుంది. చివరకు అనాధల మరణించింది. ఆమె మరణం ఇప్పటికీ కొందరిని కలచివేస్తోంది. తమిళ్ ఇండస్ట్రీలో ఆమె హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. టిక్ టిక్ టిక్, ఇనిమై ఇటో ఇటో, శ్రీ రాఘవేంద్ర సహా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తమిళ్ తో పాటు మలయాళ ఇండస్ట్రీలోనూ కొన్ని సినిమాలు చేసి మెప్పించింది. ఆరోజుల్లో నిషా నూరుకు మంచి డిమాండ్ ఉండేది.

ఇది కూడా చదవండి : సినిమాలో పద్దతిగా.. బయట మాత్రం బాబోయ్ బీభత్సం..! ఈ అమ్మడు గుర్తుందా..?

ఆతర్వాత నిషా నూరుకు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.  ప్రేక్షకుల్లో ఆమె క్రేజ్ కూడా మెల్లగా పడిపోయింది . ఆమెతో సినిమా చేయడానికి ఏ దర్శకుడు ముందుకు రాలేదు.  దాంతో ఆమె ఆర్థికంగానూ కింది స్థాయికి చేరుకుంది .అదే సమయంలో ఆమె వ్యభిచార వృత్తిలోకి దిగింది. ఎవరైనా బలవంత పెట్టారో లేక పరిస్థితులు ఆ వైపుగా నడిపించాయో తెలియదు కానీ ఆమె తప్పుడు మార్గాన్ని ఎంచుకుంది. దాంతో ఆమె పేరు ప్రతిష్టలు పోయాయి. చాలా మంది ఆమెను తక్కువ చేసి చూడటం మొదలు పెట్టారు. ఇండస్ట్రీలో ఆమెను దాదాపు మర్చిపోయారు. చివరకు చాలా కాలం తర్వాత ఓ దుర్గ బయట దారుణమైన స్థితిలో కనిపించింది. రూపం మొత్తం మారిపోయి. ఓ అస్థిపంజరంలా మారిపోయింది ఆమె. కొందరు ఆమెను గుర్తిపట్టి హాస్పటల్ ల్లో చేర్పించగా ఆమెకు ఎయిడ్స్ ఉందని తేలింది. ఆరోగ్యం మరింత క్షీణించడంతో 2007లో ఆమె కన్నుమూసింది.

ఇది కూడా చదవండి :Bigg Boss 8 Telugu: ఈ వైల్డ్ కార్ట్ ఎంట్రీ యమా హాట్ గురూ..! హౌస్‌లో మరో అందాల భామ.. ఇక రచ్చ రచ్చే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.