Tollywood: అప్పట్లో కూలీగా రోజూ రూ.20.. ఇప్పుడు కోట్లలో రెమ్యునరేషన్.. ఈ హీరో సక్సెస్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు

బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే ఎంతో కష్టపడాలి. గాడ్ ఫాదర్ లేకుండా నటుడిగా ఎదగాలంటే ఎన్నో అవమానాలు, అడ్డంకులు దాటి పోవాలి. ఈ హీరో కథ కూడా సేమ్ ఇలాంటిదే. సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన నటుల్లో ఈ హీరో కూడా ఒకడు.

Tollywood: అప్పట్లో కూలీగా రోజూ రూ.20.. ఇప్పుడు కోట్లలో రెమ్యునరేషన్.. ఈ హీరో సక్సెస్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు
Kollywood Actor

Updated on: May 14, 2025 | 1:57 PM

ఈ ప్రముఖ నటుడు 1998 లోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కెరీర్ ప్రారంభంలో పెద్దగా గుర్తింపు లేని సినిమాల్లో నటించాడు. అయితే 2004 తర్వాత ఈ నటుడి జీవితం మారిపోయింది. కమెడియన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోలందరితోనూ సినిమాల్లో నటించాడు. మొన్నటివరకు అంటే 2022 వరకు కమెడియన్ గా ఇతను ఫుల్ బిజీ. అయితే ఒకే ఒక్క సినిమా ఈ నటుడి జీవితాన్ని మార్చేసింది. అందరూ ఇతనిలో కమెడియన్ ని చూస్తే ఒక స్టార్ డైరెక్టర్ మాత్రం అతనిలో అద్భుతమైన నటుడిని చూశాడు. అందుకే తన దర్శకత్వంలోనే ఓ సినిమా తీసి అతనిని హీరోగా లాంఛ్ చేశాడు. సినిమా సూపర్ హిట్ అయ్యింది. అప్పటివరకు అతనిని కమెడియన్ గా చూసిన వారందరూ ఈ నటుడిలో ఇంత ట్యాలెంట్ ఉందా? అని ఆశ్చర్యపోయారు. హీరోగా మరిన్ని సినిమా అవకాశాలు తలుపు తట్టాయి. క్రేజ్, డిమాండ్ పెరగడంతో రెమ్యునరేషన్ కూడా పెరిగిపోయింది. ఇప్పుడు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఆ హీరో మరెవరో కాదు సూరి. అదే నండి విజయ్ సేతుపతి ‘విడుదల పార్ట్ 1’ లో అద్భుతంగా నటించి అందరి దృష్టిని ఆకర్షించిన కోలీవుడ్ నటుడు. దీని తర్వాత విడుదల పార్ట్ 2, గరుడన్, కొట్టుక్కళి, విడుదల పార్ట్ 2, బడవ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. ఇప్పుడు ‘మామన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రమోషన్లలో భాగంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో భాగంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు సూరి. అలాగే ప్రారంభంలో తను పడిన కష్టాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు

 

ఇవి కూడా చదవండి

‘తిరుప్పుర్ లో నేను రోజు కూలీగా రూ.20 జీతానికి పనిచేశాను. వారమంతా కష్టపడితే రూ.140 వచ్చేది. అందులో సగం నా ఖర్చు లకు ఉంచుకుని, మిగతా డబ్బులు ఇంటికి పంపే వాడిని. జీవిత పాఠాల్ని నేను అప్పుడే నేర్చుకున్నాను’ అని సూరి ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు సూరిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అతను పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దొరికిందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

సూరి ఎమోషనల్ స్పీచ్.. వీడియో..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .